World Languages, asked by raghunadhareddychegi, 20 days ago

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనం చేయాలి?​

Answers

Answered by kalidevimadhavi123
2

Answer:

ⓘ కుటుంబం

కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.

                                     

1. ప్రాథమిక సూత్రం

"కుటుంబం"లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాథమిక గుణం - శారీరికంగా గాని, సామాజికంగా గాని వ్యక్తులను లేదా జీవులను పునరుత్పత్తి చేయడం. కనుక కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చును. అదే పెద్దల దృష్టినుండి చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబలక్ష్యంగా కనిపిస్తుంది. అయితే పిల్లలను కనడం, పెంచడం మాత్రమే కుటుంబ వ్యవస్థ లక్ష్యాలుగా భావించనక్కరలేదు. ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో ఆ ఇద్దరు భార్యాభర్తల సహజీవనం సమాజం ఆర్థికవ్యవస్థకు చాలా అవుసరమౌతుంది. కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగా ఉంటుంది.

                                     

2. జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం

కుటుంబ దౌర్జన్యం చట్టం 498-ఎను దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబరు 12 ను జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవంగా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణ వేదిక, భారతీయ కుటుంబ సంరక్షణ ప్రతిష్ఠానం సంయుక్తంగా నిర్ణయించాయి.

                                     

3. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992లో మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంను జరుపుకోవడానికి నిశ్చయించింది.కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.

                                     

4. కుటుంబం నుంచి కుటుంబాలు

ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో. కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యో గక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుం బా లకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సం స్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదం టే అతిశయోక్తి కా దు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కార ణాలతో విచ్ఛిన్నం కా వడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేకకు టుంబాల మధ్య కని పించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.

 

                                     

5. సిరిసంపదల ఉమ్మడి కుటుంబాలు

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరి ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానిే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకు నే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.

                                     

.

                                     

 

 

 

 

Explanation:

Answered by bindubehra86
1

Answer:

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనం చేయాలి

Similar questions