ఇమ్మనేని హనుమంతరావుగారు ఏ మాస్టారు?
Answers
జీవిత విశేషాలు
ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం గ్రామానికి చెందినవాడు. ఆదివెలమ కులస్థుడు[1]. ఇతడు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై ఒంగోలు లోని మిషన్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అప్పటికి ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతడు లెక్కలు బోధించడంలో ప్రతిభ కలవాడు. బి.ఎ.క్లాసు విద్యార్థులు ఇతని వద్ద లెక్కలు నేర్చుకునేవారు. ఆ సమయంలో ఒంగోలుకు ఒక పూనా కంపెనీ ప్రమీలా స్వయంవరం, పీష్వా నారాయణరావు వధ, ఉషా పరిణయం, కీచక వధ మొదలైన హిందీ నాటకాలను ప్రదర్శించింది. వాటిని చూచిన హనుమంతరావు నాయుడుకు నాటకాలపై వ్యామోహం కలిగింది. విద్యార్థులతో నాటకాలు ప్రదర్శింపచేసి ఇతడూ నాటకాలలో పాత్రలు ధరించేవాడు. అప్పుడే టంగుటూరి ప్రకాశం పంతులను కూడా నాటకాలలో ప్రవేశ పెట్టాడు. విద్యాభ్యాసానికి టంగుటూరు నుండి ఒంగోలు వచ్చిన ప్రకాశం పంతుల ఆర్థిక సమస్యను పరిష్కరించి ఇతడు టంగుటూరి ప్రకాశం కు మార్గదర్శిగా ఉండి అతని అభివృద్ధికి మూలకారకుడయ్యాడు. ఇతని వద్ద విద్యనేర్చుకున్నవారిలో దేశభక్త కొండా వెంకటప్పయ్య కూడా ఉన్నాడు. ఇతడు శిష్యులకు చేసే సహాయాల వల్ల అతనికి వచ్చే 30 రూపాయల జీతం సరిపోయేది కాదు. అప్పుల బాధ మితిమీరడం వల్ల మంచి ఉద్యోగానికై ఇతడు రాజమండ్రి కి వెళ్లాడు. మిత్రుల సహాయంతో అక్కడ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. రాజమండ్రిలో లభించిన ప్రోత్సాహంతో నాటకాలను ప్రదర్శించేవాడు. ఒక పక్క ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ మరో పక్క నాటకాలను ప్రదర్శించేవాడు. ఇతని 1902లో పక్షవాతం వచ్చేవరకూ నాటకాలను విరివిగా ప్రదర్శించాడు.