World Languages, asked by pankajbhosal7359, 1 year ago

ఈ పొడుపు కథకి సమాధానం చెప్పిన వారు చాలా తెలివైన వారు. మూడు నెలలకి పుట్టిన వాడు, ఆరు నెలలకి పుట్టిన వాడు గొడవ పడుతుంటే, అప్పుడే పుట్టిన వాడు వచ్చి గొడవ విడదీసాడు.

Answers

Answered by poojan
17

'అమ్మ' అనే పదం ఈ ప్రశ్నకు సమాధానం.

Explanation

  • 'అమ్మ' అనే  వర్గాలుగా చేస్తే వచ్చే మూడు అక్షరాలూ  

        అమ్మ :- అ + మ్ + మ  

  • స్పష్టంగా పలికినప్పుడు మూడు అక్షరాలు సమమైన సమయం తీసుకుంటాయి కాబట్టి (దీర్గాలు లేవు కదా ), మొదట వచ్చే 'అ' అను శబ్దం మూడు నెలలకు పుట్టింది అనుకుంటే.  

  • ఆ తర్వాత సమయంలో వచ్చేది పైన ముందే అయిపోయిన 3 + ఇప్పుడు పలకడానికి 3 = 6 నెలలకు పుట్టింది 'మ్'  అనుకుందాం.  

  • ఆ తర్వాత అంతే సమయం తీసుకుని వచ్చిన (6+3) 9 నెలల శబ్దం 'అ'.  

  • ముందు 'అ' వచ్చినప్పుడు పెదవులు రెండు కొట్టుకోలేదు.  

  • 'మ్' శబ్దం రాగానే రెండు పెదవులు కొట్టుకున్నాయి. అంటే దీనిని మనం గొడవపడటం అనుకోవచ్చు.  

  • ఆ తర్వాత వచ్చే 'అ' శబ్దం రెండు పెదవులని దూరం చేస్తుంది, అంటే గొడవని ఆపుతుంది.  

  • కాబట్టి, 'అమ్మ' అనే పదం సమాధానమై ఉండొచ్చు. ఇలాంటి ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉండే అవకాశం ఉంది, ఆలోచనా విధానం మనిషి మనిషి కి మారుతుంది కదా!

Learn more :

1. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

2. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions