India Languages, asked by StarTbia, 1 year ago

ప్రశ్న:

సురవర గురునకు సతి సుతు
వర జనకుని తండ్రి కూతు వరసుతు మామన్
శిరమందుగొన్న మరసుతు
నిరతము సేవింతు నియమ నిష్కలుషమతిన్!

ఇంతకీ నేను సేవించేది ఎవరినో చెప్పుకోండి.

Answers

Answered by PADMINI
2

భావం :-

బృహస్పతి భార్య అయిన తార,

తార కుమారుడైన బుధుని,

బుధుని తండ్రి అయిన చంద్రుని,  

చంద్రుని తండ్రి సముద్రుని,

సముద్రుని పుత్రిక అయిన లక్ష్మీదేవి,

లక్ష్మీదేవి కుమారుడైన మన్మథుని,

మన్మథుని మామ అయిన చంద్రుని,

చంద్రుని తలనుదాల్చు శివుని,

శివుని కుమారుడైన వినాయకుని 

ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.


జవాబు :-

శివుని కుమారుడైన వినాయకుని ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.


Similar questions