1. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
హంసకు ఓ ప్రతిభ ఉందని అంటారు. అది పాలలోంచి నీటిని వేరు చేస్తుందట. హంస
బ్రహ్మకు వాహనం. ఒకసారి హంస సరిగ్గా బ్రహ్మగారికి అవసరమైన సమయంలోనే సభకు
ఆలస్యంగా వచ్చిందట. దాంతో బ్రహ్మకు కోపం వచ్చి “నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా పో"
అన్నారట.
అప్పుడు అహంస ఏ మాత్రం దిగులు పడుకుండా "మీరు మహా అయితే నన్ను
ఉద్యోగంలోంచి తీసేయగలరు. కానీ పాలలోంచి నీటిని వేరుచేసి పాలనే తాగే నా విద్యను
మాత్రం కాదు కదా"అని అన్నదట.
దీనిని బట్టి మనం ఓ నీతిని గ్రహించవచ్చు. మనలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటే అది ఆపద
సమయంలో ఆదుకుంటుంది. ఆత్మాభిమానాన్ని కాపాడుకునేలా చేస్తుంది.
ప్రశ్నలు
1.హంస ఎవరి వాహనం
2.పాలలోంచి దేనిని హంస వేరుచేయగలదు?
3.ఆపద సమయంలో మనని ఆదుకునేది ఏమిటి?
4.బ్రహ్మకు కోపం రావడానికి కారణమేంటి?..
5.పై గద్యంలో మీరు అనే మాట ఎవరిని ఉద్దేశించినది?
రాయండి
Answers
Answered by
0
Answer:
1. బ్రహ్మ
2. నీటిని
3. మనలోని ఒక ప్రత్యేక ప్రతిభ
4. హంస సభకు ఆలస్యంగా రావడం
5. బ్రహ్మ
Explanation:
1. మూడవ వాక్యంలో చెప్పబడినది
2. రెండవ వాక్యంలో చెప్పబడినది
3. తొమిదవ వాక్యంలో చెప్పబడినది
4. నాలుగు మరియు ఐదవ వాక్యాలలో చెప్పబడినది
5. ఆరవవాక్యంలో చెప్పబడినది
Answered by
0
Answer:
మనం ఎటువంటి దేశంలో జన్మించమని కవి చెప్పాడు దానికి జవబు
Similar questions