1. కింది పరిచిత గద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి.
* రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు.
శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు
రావణుడిని ఎదురించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద
శరవర్ష ధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు
రావణుడి ధాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో
హనుమంతుడిని బలంగా చరిచాడు రావణుడు. మారుతి
చలించిపోయాడు. అరచేతితో రావణుడిని ఒక దెబ్బ వేశాడు.
దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా! భళా! నాకు
శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నాను అని యుద్ధ
స్పూర్తిని చాటాడు రావణుడు.
i) రావణుడు ....... మీద శర వర్షధార కురిపిస్తున్నాడు.
ii) రావణుడి దెబ్బకు చలించినవారు
iii) హనుమంతుడికి గల ఇతర పేర్లు (పై పేరా ఆధారంగా)
iv) దశగ్రీవుడు అంటే
V) పై పేరాలో 'సుగ్రీవుడు'! అనేది భాషాభాగం.
II. మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారిమీద
జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఇలాంటి చర్యలకు
పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాష్ట్ర
ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తికి లేఖ
రాయండి.?
Answers
Answer:
1. వానరసేన మీద
2. సుగ్రీవుడు
3. మారుతి
4. రావణుడు
5. అవ్యయం
II
శ్రీయుత తెలంగాణ రాష్ట్ర ఉన్నత ప్రధాన న్యాయమూర్తి గారికి నమస్కారాలు.
ఆర్యా!
భారతీయ సంస్కృతి స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ సిరిసంపదలు వృద్ధి చెందుతాయి అనేది సూక్తి. స్త్రీలను కన్నతల్లిలా చూడాలని శివాజీ, శతకకారులు చెప్పారు. స్త్రీలను తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించి ఆప్యాయతలను పంచాల్సిన నేటి సమాజంలో స్త్రీ వివక్షకు గురవుతుంది. వారిపై దాడులు జరుగుతున్నాయి. కొందరు ఉన్మాదులు వారిపట్ల మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. దానికి కారణం సెల్‌ఫోన్లు, సినిమాలు, మత్తుపానీయాలు. స్త్రీలపై హింసను అరికట్టడానికి కఠిన చట్టాలను అమలు పరచాలి. వారిని ఇబ్బంది పెట్టేవారిని కఠినంగా శిక్షించాలి. నేరస్తులకు శిక్షల్లో జాప్యం ఉండరాదు. పాఠశాలల్లో నైతిక విలువలు గల పాఠ్యాంశాలను బోధించాలి.
రాబోయో తరానికి నేటి తరం ఆదర్శంగా ఉండే విధంగా పరిస్థితులు కల్పించాలని ప్రార్థిస్తున్నాం.
ఇట్లు:
తమ విధేయులు,
ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం,
సిటీ టాలెంట్ పాఠశాల, భానుపురి.
Please mark as brainliest!
Nice to see telugu people!!