పొడుపు కథలు **************
1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు. 2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు. 3. ఇంట్లో మొగ్గ, బయట పూవు. 4. ఎండిన బావిలో పిల్లల గంతులు. 5. అమ్మ పడుకుంటే బిడ్డ తిరుగాడుతుంది. 6. అంగుళం గదిలో అరవై మంది నివాసం. 7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. 8. కోస్తే తెగదు. కొడితే పగలదు. 9. కన్ను ఉన్నా తల లేదు. 10. చారెడు కుండలో మానెడు పగడాలు. 11. చుట్టింటి లోపలికి దారే లేదు. 12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది. 13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది. 14. బక్కవాడికి బారెడు చొక్కా. 15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు. జవాబులు కనుక్కోగలరేమో ప్రయత్నించండి..
Answers
పొడుపు కథలు :-
1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు. - ఆకాశం , నక్షత్రాలు
2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు.- మురళి (flute)
3. ఇంట్లో మొగ్గ, బయట పూవు. - గొడుగు
4. ఎండిన బావిలో పిల్లల గంతులు.- పేలాలు (popcorns)
5. అమ్మ పడుకుంటే బిడ్డ తిరుగాడుతుంది. - గొంగలిపురుగు
6. అంగుళం గదిలో అరవై మంది నివాసం. - అగ్గిపెట్టే
7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. - సూర్యుడు,చంద్రుడు
8. కోస్తే తెగదు. కొడితే పగలదు. - వజ్రం
9. కన్ను ఉన్నా తల లేదు. - సూది
10. చారెడు కుండలో మానెడు పగడాలు. - దానిమ్మ పండు
11. చుట్టింటి లోపలికి దారే లేదు. - కోడిగుడ్డు
12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది. - వాసన
13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది. - ఉల్లిపాయ
14. బక్కవాడికి బారెడు చొక్కా. - బట్టల హ్యాంగర్ / దిష్టి బొమ్మ
15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు. - సీతాఫలం
Answer:
హలో!
పొడుపుకథలకు సమాధానాలు:-
- నక్షత్రాలు.
- మురళి.
- గొడుగు.
- పేలాలు.
- గొంగలి పురుగులు.
- అగ్గిపెట్టె.
- సూర్యుడు, చంద్రుడు.
- వజ్రం.
- సూది.
- దానిమ్మ పండు.
- గుడ్డు.
- వాసన.
- అరటిపండు.
- దిష్టిబొమ్మ.
- సీతాఫలం.