India Languages, asked by rohitmvs1997, 9 months ago

జవాబులు 'ణి ' తో అంతమవ్వాలి.
***************

1. సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ.
2. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం
3. తమిళనాట మురుగన్ ఆలయం ఉన్న ఒక ఊరు.
4. శంకరాచార్యులు రచించిన తత్వశాస్త్రం.
5. చిరుగంట
6. శ్రీరామ చంద్రుడు
7. శ్రీ మహా విష్ణువు
8. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం.
9. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ.
10. నరకం లోని ఏరు
11. పార్వతి
12. సరస్వతి
13. శ్రీ మహాలక్ష్మి
14. యముడు
15. ఒక రాగం
16. ఒక నక్షత్రం
17. భార్య
18. దుర్గా మాత రెండవ అవతారం
19. తలమానికం
20. ధూప ద్రవ్య విశేషం
21. భూతద్దం
22. కోనేరు
23. సారాయి
24. మంచి మాటలు మాట్లాడే స్త్రీ
25. పద్ధతి
26. తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం.
27. పావడ
28. చెల్లుబాటు
29. నిలువు బొట్టు
30. సూర్యుడు.​

Answers

Answered by poojan
3

ఇచ్చిన ప్రశ్నలకు 'ణి' తో అంతమయ్యే జవాబులు .

1. సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ. :- చూడామణి

2. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం :- చింతామణి

3. తమిళనాట మురుగన్ ఆలయం ఉన్న ఒక ఊరు. :- పళణి, తిరుత్తణి

4. శంకరాచార్యులు రచించిన తత్వశాస్త్రం. :- వివేకచూడామణి

5. చిరుగంట :-  కింకిణి

6. శ్రీరామ చంద్రుడు :- కోదండపాణి

7. శ్రీ మహా విష్ణువు :- మోహిణి

8. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం. :- తరవాణి

9. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ. :- నీలవేణి

10. నరకం లోని ఏరు :- వైతరణి

11. పార్వతి :- శర్వాణి, బ్రహ్మచారిణి, కళ్యాణి, వరుణి, స్వరూపిణి

12. సరస్వతి :- వాణి

13. శ్రీ మహాలక్ష్మి :- శ్రావణి, రుక్మిణి

14. యముడు :- దక్షిణాణి

15. ఒక రాగం :- కళ్యాణి, కీరవాణి

16. ఒక నక్షత్రం  :- భరణి

17. భార్య  :- సతీమణి, గృహిణి

18. దుర్గా మాత రెండవ అవతారం  :- కాత్యాయిణి

19. తలమానికం  :- శిరోమణి

20. ధూప ద్రవ్య విశేషం  :- సాంబ్రాణి

21. భూతద్దం  :- దర్శిణి

22. కోనేరు  :- పుష్కరిణి

23. సారాయి  :- మత్తుద్రావణి

24. మంచి మాటలు మాట్లాడే స్త్రీ  :- పద్మిణి

25. పద్ధతి  :- ధోరణి

26. తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం :- పేరిణి

27. పావడ  : పరికిణి

28. చెల్లుబాటు  :- చెలామణి

29. నిలువు బొట్టు  :-  నారాయణి

30. సూర్యుడు :- ద్యుమణి

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions