India Languages, asked by Tanishq4967, 11 months ago

1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి ఎవరు?2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి ఎవరు?3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరి ఇంటివద్ద అతిధిగా ఉన్నాడు?4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది ఎవరు?5.ఆంజనేయుని వాహనం ఏమిటి?6.ద్రోణుని కుమారుని పేరేమి?7.భీష్ముని తలిదండ్రులెవరు?8.దశరధుడు ఎవరినిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను?9.సీతాదేవితల్లిదండ్రులెవరు?10.వాలికుమారునిపేరేమి?11.జఠాయువు సోదరుడెవరు?12.శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు?13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది ఎవరు?14.సుగ్రీవుని మంత్రి ఎవరు?15.కుచేలుని అసలు పేరేమి?16.నరనారాయుణులు అని ఎవరిని సంభోదిస్తారు?17.పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి?18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు?19.సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు?20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినదెవరు? ?? ​

Answers

Answered by poojan
1

పురాణ క్విజ్ :

1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి పూతన

2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి తాటకి

3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు విదురుడి ఇంటివద్ద అతిధిగా ఉన్నాడు

4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది అనసూయ

5.ఆంజనేయుని వాహనం ఒంటె

6.ద్రోణుని కుమారుని పేరు అశ్వద్ధామ

7.భీష్ముని తలిదండ్రులు శంతనుడు, గంగ

8.దశరధుడు ఋష్యశృంగుని నిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను

9.సీతాదేవి తలిదండ్రులు జనక మహారాజు, సునైనా దేవి

10.వాలి కుమారుని పేరు అంగదుడు

11.జఠాయువు సోదరుడు సంపాతి

12.శ్రీకృష్ణుని తలిదండ్రులు కన్న వాళ్ళు దేవకీ, వసుదేవుడు. పెంచిన వాళ్ళు  యశోద, నందనుడు

13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది శకుని

14.సుగ్రీవుని మంత్రి హనుమంతుడు

15.కుచేలుని అసలు పేరు సుదాముడు.

16.నరనారాయుణులు అని కృష్ణార్జునులని సంభోదిస్తారు

17.పిడుగు మంత్రాలుగా అర్జునుడి దశనామాలు పేర్లు చెప్పబడినవి.

18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది దుశ్శాసనుడు

19.సీతాదేవికి రామునిచేతిలో రావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది త్రిజట.

20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినది ద్రోణాచార్యుడు.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions