.. ఈపక్షులపేర్లు వ్రాయండి...
1 మేఘాన్ని చూసి నృత్యం చేసే పక్షి ఏది?
2 మామిడాకులు తిని పంచమస్వరంలో పలికే పక్షి ఏది? 3 ఉదయాన్నే తెల్లవారింది లేవండర్రా అనికూసే పక్షిఏది? 4 పితరులకు పెట్టిన పదార్థం తినవలసిన పక్షి ఏది ?
5 మనం చెప్పిన పలుకులు పలికే పక్షి ఏది?
6 వడ్ల గింజను ఒలిచి బియ్యం బపొట్టు పడేసే పక్షి ఏది?
7చెట్టు బెరడుని తొల్చి గూడుకట్టుకునే పక్షి ఏది ?
8నీటిలోనే ఉండి నేలమీదగూడ నడిచే వెంటనే గుడ్లు పెట్టే పక్షి ఏది? తెల్లని రెక్కలతో వలసపోయే పక్షి ఏది? 9ఎంతో ఎత్తులో ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ కోడిపిల్లల్ని పక్షుల్ని తన్నుకుపోయే పక్షి ఏది?
10చనిపోయిన టువంటి జీవుల్ని పీక్కొని తినే పక్షి ఏది? 11మానససరోవరంలో విహరించే పక్షి ఏది?
12ఒంటికాలి మీద జపం చేసే పక్షి ఏది ?
13 రెండు జాతులు పక్షుల కలిపి పాట పాడుతారు అవి ఏవి? కులుకే పకాపకా అని...
14 విష్ణుమూర్తి వాహనం గా ఉన్నటువంటి పక్షి ఏది?
15 కుమార స్వామివాహనంగా ఉండే పక్షి ఏది ?
16లక్ష్మీదేవి వాహనం ఉండే పక్షి ఏది?
Answers
పక్షుల పేర్లు :
1 మేఘాన్ని చూసి నృత్యం చేసే పక్షి నెమలి.
2 మామిడాకులు తిని పంచమస్వరంలో పలికే పక్షి కోకిల
3 ఉదయాన్నే తెల్లవారింది లేవండర్రా అని కూసే పక్షి కోడి
4 పితరులకు పెట్టిన పదార్థం తినవలసిన పక్షి కాకి
5 మనం చెప్పిన పలుకులు పలికే పక్షి చిలుక / గోరింక
6 వడ్ల గింజను ఒలిచి బియ్యం బపొట్టు పడేసే పక్షి పిచ్చుక
7 చెట్టు బెరడుని తొల్చి గూడుకట్టుకునే పక్షి వడ్రంగి పిట్ట
8 నీటిలోనే ఉండి నేలమీదగూడ నడిచే వెంటనే గుడ్లు పెట్టే పక్షి బాతు
9 తెల్లని రెక్కలతో వలసపోయే పక్షి గూడకొంగ
9 ఎంతో ఎత్తులో ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ కోడిపిల్లల్ని పక్షుల్ని తన్నుకుపోయే పక్షి డేగ, గ్రద్ద
10 చనిపోయిన టువంటి జీవుల్ని పీక్కొని తినే పక్షి రాబందు
11 మానససరోవరంలో విహరించే పక్షి హంస
12ఒంటికాలి మీద జపం చేసే పక్షి కొంగ
13 రెండు జాతులు పక్షుల కలిపి పాట పాడుతారు చిలుక, గోరింక
14 విష్ణుమూర్తి వాహనం గా ఉన్నటువంటి పక్షి గరుడ
15 కుమార స్వామివాహనంగా ఉండే పక్షి నెమలి
16 లక్ష్మీదేవి వాహనం ఉండే పక్షి గుడ్లగూబ
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. Essay on telugu language in telugu.
brainly.in/question/788459
3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876