1కుంతీదేవి అసలు పేరు ఏమిటి ?
2.ధృతరాష్ట్రుని కూతురు పేరు ఏమిటి ?
3.శ్రీ రామునికి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు బహూకరించారు ?
4.అలంబాసురుని ఎవరు సంహరిస్తారు ?
5.తారక మంత్రాన్ని మొదలు ఎవరు ఎవరికి ఉపదేశించారు?
6.నారదుని వీణ పేరు ఏమిటి? 7.వృకోదరుడు అని ఎవరిని అంటారు?
8.రావణుడి చెల్లెల్లు పేరు ఏమిటి?
9.అభిమన్యుడి కుమారుని పేరు ఏమిటి?
10.శకుని మాయా పాచికలు ఎలా తయారు అయ్యాయి?
11.దశరథుని అల్లుని పేరు ఏమిటి?
12.హనుమంతుని తల్లి తండ్రులు ఎవరు?.
13.ఘటోత్కచుని తల్లి ఎవరు?
14.శిఖండి గా మారినది ఎవరు?
15.వంద తప్పుల తరువాత శ్రీ కృష్ణుడు ఎవరిని సంహరించాడు?
16.విరాట కొలువు లో ధర్మరాజు పేరు?
17.భగవధ్గీతకు ఇంకొక పేరు ఏమిటి?
18.గాంగేయుడు అని ఎవరిని పిలుస్త��రు?
19.వ్యాసమహర్షి తల్లి తండ్రులు ఎవరు?
20.ధృతరాష్ట్రుడి అల్లుడు ఎవరు?
Answers
Answered by
1
Answer:
నారదుడు లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.
Answered by
5
Answer. :1. పృథ
2. దుశ్శల
3. అగస్త్య మహర్షి
4. కృష్ణుడు
5. శివుడు పార్వతి కి
6.కచ్చపి
7. భీముడిని
8. శూర్పణఖ
9. పరిక్షిత్
10.తండ్రి ఎముకలతో
11. రిష్యరింగ
12.అంజన, కేసరి\వాయు.
13.హిడింబి.
14.అంబలో ప్రవేశించిన యక్షుడు.
15.శిశుపాలుని.
16.కంకభట్టు.
17.గీతోపనిషత్\శ్రీ కృష్ణ గీత.
18. భీష్మడి ని కార్తికేయుడు.
19.సత్యవతి, పరాశర మహర్షి.
20. జయధ్రత /సైంధవ.
Similar questions