History, asked by Leem5769, 9 months ago

1.కుంతీదేవి అసలు పేరు ఏమిటి ?
2.ధృతరాష్ట్రుని కూతురు పేరు ఏమిటి ?
3.శ్రీ రామునికి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు బహూకరించారు ?
4.అలంబాసురుని ఎవరు సంహరిస్తారు ?
5.తారక మంత్రాన్ని మొదలు ఎవరు ఎవరికి ఉపదేశించారు?
6.నారదుని వీణ పేరు ఏమిటి? 7.వృకోదరుడు అని ఎవరిని అంటారు?
8.రావణుడి చెల్లెల్లు పేరు ఏమిటి?
9.అభిమన్యుడి కుమారుని పేరు ఏమిటి?
10.శకుని మాయా పాచికలు ఎలా తయారు అయ్యాయి?
11.దశరథుని అల్లుని పేరు ఏమిటి?
12.హనుమంతుని తల్లి తండ్రులు ఎవరు?.
13.ఘటోత్కచుని తల్లి ఎవరు?
14.శిఖండి గా మా‌రినది ఎవరు?
15.వంద తప్పుల తరువాత శ్రీ కృష్ణుడు ఎవరిని సంహరించాడు?
16.విరాట కొలువు లో ధర్మరాజు పేరు?
17.భగవధ్గీతకు ఇంకొక పేరు ఏమిటి?
18.గాంగేయుడు అని ఎవరిని పిలుస్తారు?
19.వ్యాసమహర్షి తల్లి తండ్రులు ఎవరు?
20.ధృతరాష్ట్రుడి అల్లుడు ఎవరు?

Answers

Answered by poojan
8

పైన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు.

1. కుంతీదేవి అసలు పేరు పృథ

2. ధృతరాష్ట్రుని కూతురు పేరు దుశ్శల

3. శ్రీ రామునికి బ్రహ్మాస్త్రాన్ని అగస్త్య మహర్షి బహూకరించారు

4. అలంబాసురుని శ్రీ కృష్ణుడు సంహరిస్తారు.

5. తారక మంత్రాన్ని మొదలు శివుడు పార్వతి దేవికి  ఉపదేశించారు.

6. నారదుని వీణ పేరు కచ్చపి

7. వృకోదరుడు అని భీముడిని అంటారు

8. రావణుడి చెల్లెల్లు పేరు శూర్పణఖ

9. అభిమన్యుడి కుమారుని పేరు పరీక్షితుడు

10 .శకుని మాయా పాచికలు తండ్రి అయిన సుబలుని ఎముకలతో  తయారు అయ్యాయి

11. దశరథుని అల్లుని పేరు రుష్యశృంగుడు

12. హనుమంతుని తల్లి తండ్రులు అంజనా దేవి , కేసరి\వాయు.

13. ఘటోత్కచుని తల్లి హిడింబి

14. శిఖండి గా మా‌రినది అంబలో ప్రవేశించిన యక్షుడు

15. వంద తప్పుల తరువాత శ్రీ కృష్ణుడు శిశుపాలుడిని సంహరించాడు

16. విరాట కొలువు లో ధర్మరాజు పేరు కంకభట్టు

17. భగవధ్గీతకు ఇంకొక పేరు గీతోపనిషత్, పంచమ వేదం

18. గాంగేయుడు అని భీష్ముడిని  పిలుస్తారు

19. వ్యాసమహర్షి తల్లి తండ్రులు పరాశర మహర్షి, సత్యవతి

20. ధృతరాష్ట్రుడి అల్లుడు జయధ్రత సైంధవుడు

Learn more:

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions