India Languages, asked by jivanshantiamc97981, 9 months ago

*రెండు ఖాళీలలో ఒకే జవాబు రావాలి.,*1) ........... తింటే ఆరోగ్యంగా ....... తాము.2)లతా! నా ........ ఎక్కడుందో ........3) అమ్మ ఆ ....... లోని గవ్వలు ..........4)ఆ చెట్టు ......... ఈ చెట్టువేరు ......... గా ఉన్నాయి5)........... ని అడగనిదే నా స్కూటర్ .........ను6)............ బడిన ఇంట్లో పాటలు ..........తున్నారేంటి7) ............ ఉల్లిగడ్డలు రోట్లో వేసి ...........8) ఈ ........ తీసుకెళ్లి .......... దిక్కు ఇంట్లో ఇవ్వు9)............ గా ఉన్నచోట ఈ వేప ......... వేయండి10)ఆ ........... గిన్నెలోనే ........ సంకటి తీసుకురా​

Answers

Answered by PADMINI
1

రెండు ఖాళీలలో ఒకే జవాబు రావాలి.

1. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము

2. లతా! నా చెప్పు ఎక్కడుందో చెప్పు

3. అమ్మా ఆ ఏరు లోని గవ్వలు ఏరు

4. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా వున్నాయి

5 .అమ్మని అడగనిదే నా స్కూటర్ అమ్మను

6. పాడు బడిన ఇంట్లో పాటలు పాడుతున్నారు ఏంటి

7. నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు

8. ఈ ఉత్తరం తీసుకు వేళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు

9. పొడి గా వున్న చోట వేప పొడి వేయండి

10. ఆ రాగి గిన్నె లోని రాగిసంకటి తీసుకుకరా

Similar questions