కింది పొడుపు కథలను విప్పండి చూద్దాం!
1. పళ్ళు ఉన్నా కరవలేనిది? -
2. పళ్ళు ఉన్నా నోరు లేనిది?
3. రాజు గారి తోటలో రోజా పూలు చూచేవారేగాని లెక్కవేసే వారే లేరు?
4. తెల్లటి పొలములో నల్లని విత్తనాలు చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం?
5. చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపి చెప్పండి, ఇది చెప్పండి?
6. అంగుళం గదిలో, అరవై మంది నివాసం?
7. తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది?
8. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
9. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?
10. ఊరంతటికీ ఒక్కటే దుప్పటి?
Answers
పొడుపు కథలు - జవాబులు
1. పళ్ళు ఉన్నా కరవలేనిది? - దువ్వెన
2. పళ్ళు ఉన్నా నోరు లేనిది? - రంపం
3. రాజు గారి తోటలో రోజా పూలు చూచేవారేగాని లెక్కవేసే వారే లేరు? - తారలు
4. తెల్లటి పొలములో నల్లని విత్తనాలు చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం? - పుస్తకంలోని పదాలు
5. చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపి చెప్పండి, ఇది చెప్పండి? - కలం
6. అంగుళం గదిలో, అరవై మంది నివాసం? - అగ్గిపెట్టె
7. తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది? - ఉత్తరం
8. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? - పనసకాయ
9. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు? - ఉల్లిపాయ
10. ఊరంతటికీ ఒక్కటే దుప్పటి? - ఆకాశం
Answer:
హలో! ఇక్కడ ఒక తెలుగువారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఇంకా విషయానికి వస్తే,
ఇటువంటి పొడుపుకథలు విప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం.
- దువ్వెన.
- దువ్వెన, రంపం.
- రాజు గారి తోట- ఆకాశం. పూలు - నక్షత్రాలు.
- పుస్తకం, అక్షరాలు.
- పెన్ను(కలం)
- అగ్గిపెట్టె.
- ఉత్తరం.
- తేనె పట్టు.
- ఉల్లి.
- ఆకాశం.
నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.