India Languages, asked by pinalpatel8159, 7 months ago

*సం* అనే అక్షరం తో ముగిసే పదాలు కనుక్కోండి .. 1. పశువులకు మేత .... 2. బ్యాటరీలో వాడేది ... 3. రోషానికి సంకేతం... 4. నెలను ఇలా కూడా అంటారు ... 5. పాలతో చేసే స్వీట్ ... 6. ఠీవి ...... 7. పరిగెడితే వచ్చేది.... 8. చేయలేని పని చేయడం.... 9. నిలయం ...... 10. చిరు నవ్వు ... 11. మనసు ..... 12. వ్యాకరణంలో వచ్చేది .... 13. వలస.... 14. అన్ని పరిత్యదించడాన్ని ... 15. ప్రదర్శన ... 16 కాకి మరోపేరు ... 17. చుట్టూ కొలత. 18.అడవిలో జీవనం .. 19.చులకన చేయడం .. 20. కలసి బ్రతకటం .... 21. శక్తి తగ్గ��తే వచ్చేది ... 22. సుర నెల ....

Answers

Answered by PADMINI
1

*సం* అనే అక్షరం తో ముగిసే పదాలు ;-

1. పశువులకు మేత :- పశు గ్రాసం

2. బ్యాటరీలో వాడేది :- సీసం

3. రోషానికి సంకేతం:- మీసం

4. నెలను ఇలా కూడా అంటారు :- మాసం

5. పాలతో చేసే స్వీట్ :- పాయసం

6. ఠీవి :- రాజసం

7. పరిగెడితే వచ్చేది :- ఆయాసం

8. చేయలేని పని చేయడం :- సాహసం

9. నిలయం :- నివాసం

10. చిరు నవ్వు :- దరహాసం

11. మనసు :- మానసం

12. వ్యాకరణంలో వచ్చేది :- సమాసం

13. వలస :- ప్రవాసం

14. అన్ని పరిత్యదించడాన్ని :- సన్యాసం

15. ప్రదర్శన :- విన్యాసం

16 కాకి మరోపేరు :- వాయసం

17. చుట్టూ కొలత :- వ్యాసం

18. అడవిలో జీవనం :- వనవాసం

19. చులకన చేయడం :- పరిహాసం

20. కలసి బ్రతకటం :- సహవాసం

21. శక్తి తగ్గితే వచ్చేది :- నీరసం

22. సుర నెల :-  స్వర్గవాసం

Similar questions