క్రింది వాక్యాలకు జాతీయాలు వ్రాయండి.
1. తేనె పూసిన కత్తి
2. అడుగున పడిపోవు
3. కారాలు మిరియాలు నూరట
4. చేవుకోసుకొని
5. అరికాలి మంట నెత్తికెక్కు
Answers
1. తేనె పూసిన కత్తి = తియ్యగా మాట్లాడుట
మోసగాని మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయి.
2. అడుగున పడిపోవు = పేరు ప్రతిష్ఠలు దెబ్బతినుట
మన రాజకీయ నాయకులపై వచ్చిన వివిధ కుంభకోణాలతో మన దేశ ప్రతిష్ఠ అడుగున పడిపోయింది.
3. కారాలు మిరియాలు నూరట = మిక్కిలి కోపావేశాలను కలిగి ఉంటాయి.
చీకటిపడేసరికి ఇంటికి చేరకపోతే మా అమ్మగారు మా మీద కారాలు మిరియాలు నూరుతుంటారు.
4. చెవికోసుకొను = వినడానికి బాగా ఇష్టపడడం
మా నాన్నగారు ఘంటసాల గారి పాటలంటే చెవికోసుకుంటారు.
5. అరికాలి మంట నెత్తికెక్కు = కోపంతో మండిపడడం.
కొడుకు పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేదని తండ్రికి అరికాలి మంట నెత్తికెక్కింది.
Answer:
మోసమైన మాటలను తియ్యగా విన్నపుడు ఈ జాతీయాన్ని వాడుతారు
మన పరువు ప్రతిష్ఠలు పోయినపుడు ఈ జ్యతియని వాడతారు
కోపంతో చిటపటలాడాడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు
5.ఏకువగ కోపపడినపుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు