*ఈ రాజు లెవరో పేరులు రాయండి*
1. పది తలల రాజు ఎవరు?
2. దిన రాజు ఎవరు?
3. రారాజు ఎవరు?
4. వలరాజు ఎవరు?
5. నగరాజు ఎవరు?
6. ఖగరాజు ఎవరు?
7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు?
8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?
9. నెలరాజు ఎవరు?
10. మృగరాజు ఎవరు?
11. దేవతల రాజు ఎవరు?
12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?
13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?
14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?
15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?
16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?
17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?
18. అష్టదిగ్గజాలనేలిన
రాజు ఎవరు?
19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?
20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?
Answers
Answer:1.రావణాసురుడు
2.సూర్యుడు
3.దుర్యోధనుడు
4.మన్మధుడు
5.హిమవంతుడు
6.గరుత్మంతుడు
7.దిలీపుడు
8.దశరధుడు
9.చంద్రుడు
10.సింహం
11.ఇంద్రుడు
12.త్రిశంకుడు
13.హరిశ్చంద్రుడు
14.ధర్మరాజు
15.దృతరాష్ట్రుడు
16.పరీక్షత్తు మహారాజు.
17.శంతన మహారాజు
18.శ్రీ కృష్ణ దేవ రాయలు
19.రాజ రాజ నరేంద్రుడు
20.శ్రీ రామచంద్రుడు
Explanation:
సమాధానాలు:
1) పది తలల రాజు రావణుడు.
2) సూర్యుడు - దిన రాజు
3.దుర్యోధనుడు రారాజు.
4.మన్మధుడు - వలరాజు
5.హిమవంతుడు - నగరాజు
6. ఖగరాజు - గరుత్మంతుడు
7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు దిలీపుడు
8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు దశరథుడు. రాముడి తండ్రి.
9.చంద్రుడు - నెల రాజు
10.సింహన్ని మృగ రాజు అంటారు.
11.దేవతల రాజు ఇంద్రుడు.
12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు - త్రిశంకుడు
13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు సత్య హరిశ్చంద్రుడు.
14. జూదం లో ఆలిని ఓడిన రాజు ధర్మరాజు
15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు దృతరాష్ట్రుడు.
16. భాగవతం విని మోక్షం పొందిన రాజు పరీక్షత్తు మహారాజు.
17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు శంతన మహారాజు.
18. అష్టదిగ్గజాలనేలిన రాజు శ్రీ కృష్ణ దేవరాయలు.
19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు రాజ రాజ నరేంద్రుడు.
20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు శ్రీ రాముడు.