1.
"చదువు వల్ల సంస్కారం కలుగుతుంది. విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది". దీనిని సమర్ధిస్తూ పాఠం
ఆధారంగా రాయండి.
Answers
Answer:
భగవంతుడు సృష్టించిన సకల జీవకోటి రాశుల్లో మానవ జన్మ మహోన్నతమైంది. ఎంతోమంది మహాత్ములు నడయాడిన ఈ పుణ్యభారతావనిలో.. జన్మించడం మనం చేసుకొన్న గొప్ప భాగ్యం. అలాంటి మానవజన్మకు ఓ అర్థం పరమార్థం చేకూరాలంటే.. మన మహాత్ములు చూపిన మంచి మార్గాన పయనించాలి. మనం సృష్టించుకొన్న కుల మత వర్గ వైషమ్యాలను విడనాడి మానవత్వంతో మనుషులుగా జీవించాలి.
మన జీవన యానంలో బాల్యం, యవ్వనం వృద్ధాప్యం తప్పనిసరి. బాల్యం ఆటపాటలతో అల్లరి చిలిపి పనులతో ముద్దుగా బంగారుమయంగా సాగుతుంది. ఆ తర్వాత వచ్చేది జీవితంలో ముఖ్యమైన దశ యవ్వనం. ఆ దశలో పయనం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. లేదంటే అధోగతిపాలు జేస్తుంది. ఎందుకంటే యవ్వనం ఉరికే జలపాతం లాంటిది. అడ్డు అదుపు లేకుంటే జలపాత నీరు సముద్రంలో కలుస్తుంది. అదే జలపాతానికి అడ్డుకట్టవేసి పంట పొలాలకు తరలిస్తే బంగారు పంటలు పండుతాయి. అఖిల జనావళికి ఆహారం దొరుకుతుంది. అందుకే యవ్వనంలో మంచి విద్య, బుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడివైతే కుటుంబానికి, దేశానికి ప్రయోజనం