1. దానాలన్నీ వేటికవే గొప్పవి. అయితే నేటి కాలంలో రక్తదానం, మరణానంతరం అవయవదానం వంటివి చేస్తున్నారు.
కదా! వాటి యొక్క ప్రాధాన్యాన్ని చర్చించండి.
2. పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదువండి.
ఒకటో పద్యానికి ఇక్కడ ప్రతిపదార్థం ఉంది. ఇదే విధంగా నాలుగు, ఆరు సంఖ్యగల పద్యాలకు ప్రతి పదార్థాల
రాయండి.
వదాన్య + ఉత్తమా!
- దాతల్లో శ్రేష్ఠుడా! (ఓ బలిచక్రవర్తీ!)
కులమున్
= (మీ) వంశాన్ని
8
తెలంగాణ ప్రభుత్వంచే ఉచిత పంపిణీ 2020-
Answers
Answer:భావం అంటే మనకున్నది ఇవ్వడం. అది కూడా కావలసిన వారికే ఇవ్వాలి అడిగిన వారికి ఇవ్వాలి. ధనం దానం చేస్తాం. దానివలన అడిగిన వారికి కొన్ని అవసరాలు తీరతాయి. అన్నదానం చేస్తే గ్రహీతకు ఆకలి తీరుతుంది. విద్యాదానం చేస్తే గ్రహీతకు జ్ఞానం వస్తుంది. అంటే మనం ఏ దానం చేసినా స్వీకరించడానికి గ్రహీత ఉండాలి కదా! దాత కూడా ఎంత గొప్పవాడైనా ప్రాణం లేకపోతే ఏమీ చేయలేదు.
అందుచేత ప్రాణదానం అన్ని దానాలకంటే ఉత్తమమైనది. ప్రాణం నిలబడాలంటే రోగాలు తగ్గాలి. కొన్ని రకాల రోగాలకు కారణం లేకపోవడం, ఆపరేషన్లు జరిగినపుడు రోగికి రక్తం కావాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పాలవుతాడు. అప్పుడు కూడా రోగి ప్రాణాలు కాపాక్షానికి రక్తం కావాలి. ఒక్కొక్కసారి కావలసిన గ్రూపు రక్తం దొరకక రోగి ప్రాణాలు కూడా పోతాయి. అందుచేత అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. దానివలన దాతకు కూడా నష్టమేమీ లేదు. మళ్ళీ వెంటనే కొత్త రక్తం పడుతుంది. కనీసం ఆరునెలలకొకసారి రక్తదానం చేయాలి. దానివల్ల రక్తం శుద్ధి అవుతుంది. అత్యవసర పరిస్థితులలో వైద్యుల సలహాలననుసరించి రక్తదానం చేయవచ్చు.
మనకు తెలియకుండానే ఎంతో మందికి ప్రాణదానం చేసిన పుణ్యం వస్తుంది. ఆరోగ్యానికి మంచిదే. కొంతమంది కొన్ని అవయవాలు పనిచేయక మరణిస్తారు. అటువంటి వారిలో ఎక్కువమంది మూత్రపిండాల వ్యాధితో మరణిస్తుంటారు. వారిని అడ్డుకోవాలంటే మూత్రపిండం దానం చేయవచ్చు. ప్రతి మనిషికి రెండు మూత్రపిండాలు ఉంటాయి. వైద్యులు సలహాతో ఒకటి దానం చెయ్యవచ్చు.
ట్రెయిన్లెడ్ అయిన వారి కళ్ళు, కాలేయం గుండె మొదలైనవి ఆయా అవసరాలున్న వారికి మార్పిడి చేయవచ్చు. దానివలన మరొకరి అవయవాల రూపంలో జీవించవచ్చు. వారికి అవయవదానం చేసిన పుణ్యం కూడా వస్తుంది. అందుకే తన మరణానంతరం తన అవయవాలను దానం చేయవలసినదిగా వీలునామా రాయాలి. బంధువులు కూడా ఆటంకపరచకూడదు. పోయిన ప్రాణం తిరిగిరాదు. శరీరం కూడా నశించి పోతుంది. అవయవాలు దానం చేస్తే మరొకరి జీవితంలో వెలుగు వస్తుంది.
Explanation: