1. ఎంతవారైనా ధనానికి దాసోహం కాక తప్పదు.
Answers
భారతదేశంలోని గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వచ్చే పదేళ్లలో నీటియుద్ధాలు చోటుచేసుకోవచ్చునని అమెరికా గూఢచార నివేదిక ఇటీవల ప్రమాద ఘంటికలు మోగించింది. దేశంలో జల సమతుల్యత లోపించిందని, 2050నాటికి అది వివిధ ప్రాంతాల్లో సంక్షోభానికి దారితీయవచ్చునని జాతీయ జలసంఘం 1999లోనే హెచ్చరించింది. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి గట్టి చర్యలు చేపట్టాల్సింది పోయి, గుర్రుకొట్టి నిద్రపోతున్న నేతాగణాన్ని మేల్కొలిపేదెలాగన్నది చిక్కుప్రశ్న. సుప్రీంకోర్టే దానికి సరైన సమాధానం చెప్పింది. వారి కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. నదుల అనుసంధానానికి సత్వరం పూనుకోవాల్సిందిగా పిలుపిచ్చింది. సంబంధిత దస్త్రాలను కట్టకట్టి బీరువాల్లో కుక్కిన నాయకులు, ఇప్పటికైనా వాటిని కిందికి దించి ఈ కలల పథకాన్ని సాకారం చేసేందుకు నడుం కడతారా?
Answer:
మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒడిషా మొత్తము, జార్ఖండ్, మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.