అ)కింది ప్రశ్నకు ఆరు వాక్యాల్లో జవాబు రాయండి.
1) దురాశ దుఃఖానికి మూలం' ఎట్లాగో వివరించండి.
Answers
Answer:
ఆశకు అంతులేదని మన పెద్దలు అంటారు మానవుడు ఆశాజీవి. ఆశ లేకపోవు మానవుని మనుగడ కష్టం. కాని ఆశ దురాశగా మారకూడదు. దురాశ వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. హద్దులు దాటని ఆశ, పరిధులు దాటని ఆశ మాన వుడిని ప్రయత్నశీలుడిని చేసి, తాను ఆశించిన ఫలితాలను పొందడానికి ప్రోత్సాహమిస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా భవిష్యత్తుపై చిన్న దుఆశ మానవుడిని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. కాని ఈ ఆశ దురాశగా మారితే మనిషి పాలిట ఒక శాపంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యాశ ప్రాణాపాయంగా మారుతుంది. చరిత్రలో ఎంతోమంది దురాశకు లోనై అనర్థాలను పొందినవారు ఉన్నారు. దొంగలు దురాశకు లోనై జైళ్ళ పాలౌతున్నారు. ఎంతోమంది ధనం మీద దురాశతో అవినీతి మార్గంలో ధనాన్ని సంపాదిస్తారు. చివరకు పట్టుపడి అగౌరవాన్ని పొందుతారు. కటకలను పాలౌతున్నారు.
అందువల్ల అత్యాశకు పోకుండా తనకున్న దానితోనే సంతృప్తిగా జీవించాలి. స్వార్ధాన్ని మానుకొని కొంత ధనాన్ని పెదలకు ఇవ్వాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి.