1. మీకు ఏ పువ్వంటే ఇష్టం? ఎందుకు?
Answers
Explanation:
తామర పువ్వు (లేదా పద్మము) (ఆంగ్ల భాషలోLotus flower) చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల ఆకులు గుండ్రంగా, ఆకుల కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.
Answer:
నాకు ఇష్టమైన పువ్వు 'మల్లె'. దీనిని ఆంగ్లంలో ' Jasmine' అంటారు. ఇది సుమారు 200 రకాల జాతులుగా ఉష్ణమండల మరియు వెచ్చని ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలలో ఉంటుంది. ఈకుటుంబానికి చెందినదే జాజీ మల్లెల్లో 40 రకాలు ఉంటాయి. మన రాష్ట్రంలో అధికంగా పందిరిమల్లె, తుప్ప మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె, నిత్యమల్లె వంటి వాటిని విరివిగా సాగుచేస్తారు. మల్లెలు మాఘమాసంలో పూయడం మొదలు పెడతాయి. కనుక వీటిని 'మాఘ్యం' అంటారు. ఇంకా 'వార్షికి, శీత భీరుపు' అంటారనీ అమరకోశం చెబుతోంది. ఆరోగ్యపరంగా కళ్ళపై ఈ పూలను ఉంచుకుంటే చలువ చేస్తుంది. చుండ్రు సమస్యలకు, జుట్టు ఒత్తుగా పెరగడానికి మల్లె దోహదకారి. ముఖ కాంతికి తోడ్పడుతుంది. మల్లెపూవులో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పలు ఔషధాలలో ఈపూలను వాడుతున్నారు. ఇంకా దీని వాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. ఇన్ని కారణాల వల్ల నాకు 'మల్లెపూవు' అంటే ఇష్టం.