1.నిరక్షరాస్యతనిర్మూలన
composition
Answers
Answer:
భారతదేశంలో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది. నేడు, ఐఐటీ లు, ఐఐఎస్ లు, ఐఐఎమ్ లు, ఏఐఐఎమ్ఎస్, ఐఎస్ బిలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినవి. భారతదేశంలో విద్య, 100% సాధించేందుకు ఓ సవాలుగా తీసుకొని ముందుకు పోతూ ఉంది. భారతదేశంలో అవిద్య లేదా నిరక్షరాస్యత అభివృద్ధికి పెద్ద అడ్డుగోడలా తయారైంది. నిరక్ష్యరాస్యతకు పేదరికం జీవాన్నిస్తూవుంది. పేదరికం, సామాజిక అసమతుల్యతల మూలంగా, సహజవనరులను సరైన ఉపయోగించే విధానాలు లేక, విద్యకొరకు అతితక్కువ బడ్జెట్ కేటాయించడంవల్ల, ప్రాథమిక విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి వలన, నిరక్ష్యరాస్యత వెక్కిరిస్తూవున్నది. కేరళ లాంటి రాష్ట్రాలలో అక్షరాస్యత స్థితులను చూసి భారతదేశంలో విద్య పట్ల కొంచెం ఆశ చిగురిస్తుంది. భారత్ లో మానవవనరుల అభివృద్ధి శాఖ, ఉన్నత విద్యా శాఖ, పాఠశాల విద్య మున్నగు శాఖలు విద్య కొరకు పాటుపడుతున్న సంస్థలు. విద్య కొరకు, సరైన పెట్టుబడులు, బడ్జెట్ లు లేని భారత్, ఇతరదేశాలనుండి, నేరుగా పెట్టుబడులు ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది
Explanation:
I don't know correct or wrong
హైదరాబాద్ : రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా మార్చడం కోసం సీఎం కేసీఆర్ ఈచ్ వన్ టీచ్ వన్ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని అందించారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించడం కోసం ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన జరుగుతున్నదని తెలిపారు. ఇందు కోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం రూ. 2,650 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖకు రూ. 10,421 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723.27 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.