1
Secondary School
India languages
5 points
కింది పొడుపు కథలను విప్పండి చూద్దాం!
1. పళ్ళు ఉన్నా కరవలేనిది? -
2. పళ్ళు ఉన్నా నోరు లేనిది?
3. రాజు గారి తోటలో రోజా పూలు చూచేవారేగాని లెక్కవేసే వారే లేరు?
4. తెల్లటి పొలములో నల్లని విత్తనాలు చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం?
5. చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపి చెప్పండి, ఇది చెప్పండి?
6. అంగుళం గదిలో, అరవై మంది నివాసం?
7. తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది?
8. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
9. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?
10. ఊరంతటికీ ఒక్కటే దుప్పటి?
Answers
Answered by
2
Answer:
హలో!
నీ ప్రశ్నకు సమాధానం:-
- పళ్ళు ఉన్నా కరవలేనిది? - దువ్వెన, రంపం
- పళ్ళు ఉన్నా నోరు లేనిది? - దువ్వెన, రంపం
- రాజు గారి తోటలో రోజా పూలు చూచేవారేగాని లెక్కవేసే వారే లేరు? - ఆకాశం, నక్షత్రాలు.
- తెల్లటి పొలములో నల్లని విత్తనాలు చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం? - పుస్తకం, అక్షరాలు.
- చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపి చెప్పండి, ఇది చెప్పండి? - కలం(పెన్ను).
- అంగుళం గదిలో, అరవై మంది నివాసం? - అగ్గిపెట్టె.
- తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది? - ఉత్తరం.
- ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? - తేనె పట్టు.
- ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు? - ఉల్లిపాయ.
- ఊరంతటికీ ఒక్కటే దుప్పటి? - ఆకాశం.
నా సమాధానం నీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను..❣️❣️
Similar questions