10. రూపక సమాసంకు సంబందించిన పదం
a)కర్మశాల
b)మూడు దోషాలు
c)ఆశ పాశం
d)నీతివాచస్పతి
answer this question fast it is urgent please..........
Answers
Answer: అవ్యయీభావ సమాసము: సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము
ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి
ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.
సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము
విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము
ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.
అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.
నఞ్ తత్పురుష సమాసము: అభావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - 'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము
ద్వంద్వ సమాసము: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
బహువ్రీహి సమాసము: అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.
అనంతం || అంతం లేనిది || నఞ తత్పురుష సమాసం
అర్ధరాత్రి || రాత్రి యొక్క అర్ధభాగము || ప్రథమా తత్పురుష సమాసం
అసాధ్యము || సాధ్యము కానిది || నఞ తత్పురుష సమాసం
ఆలుమగలు || ఆలును మగడును || ద్వంద్వ సమాసం
ఊతపదాలు || ఊతం కొరకు పదాలు || చతుర్థీ తత్పురుష సమాసం
కంటినీరు || కంటి యందలి నీరు || సప్తమీ తత్పురుష సమాసం
కనకాభిషేకము || కనకముతో అభిషేకము || తృతీయా తత్పురుష సమాసం
కుటీరపరిశ్రమ || కుటీరము లోని పరిశ్రమ || సప్తమీ తత్పురుష సమాసం
కులవృత్తులు || కులము యొక్క వృత్తులు || షష్ఠీ తత్పురుష సమాసం
కూరగాయలు || కూరయు, కాయయు || ద్వంద్వ సమాసం
గంగానది || గంగ అను పేరుగల నది || సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గృహప్రవేశము || గృహమునందు ప్రవేశము || సప్తమీ తత్పురుష సమాసం
చంద్రుడు || చల్లనైన కిరణములు కలిగినవాడు || బహువ్రీహి సమాసం
చతుర్ముఖుడు || నాలుగు ముఖములు కలవాడు || బహువ్రీహి సమాసం
చిరునవ్వు || చిన్నదైన నవ్వు || విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
తల్లిదండ్రులు || తల్లియును తండ్రియును || ద్వంద్వ సమాసం
త్రికరణాలు || త్రి (మూడు) సంఖ్యగల కరణాలు || ద్విగు సమాసం
తెలుగుభాష || తెలుగు అను పేరుగల భాష || సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
దీపావళి || దీపముల యొక్క ఆవళి || షష్ఠీ తత్పురుష సమాసం
దేశద్రోహులు || దేశానికి ద్రోహులు || షష్ఠీ తత్పురుష సమాసం
నరసింహుడు || సింహము వంటి నరుడు || ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
నల్లకలువ || నల్లనయిన కలువ || విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవరసాలు || నవ (తొమ్మిది) సంఖ్యగల రసాలు || ద్విగు సమాసం
Explanation: Please mark me the brainleist