10 th class Telugu 1 st lesson Saramsam
answer
Answers
Explanation:
నేపథ్యం
మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తరువాత అబ్బాజీసో దేవుడు, విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోనీదేవుడు శివాజీతో “దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి, సర్వస్వాన్నీ, రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను” అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి, ఆమెకు అగౌరవం కల్గించినందుకు చింతిస్తూ, ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిదీ పాఠ్యాంశం.
కవి పరిచయం
ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు, శతావధాని డా॥ గడియారం వేంకటశేష శాస్త్రి. ఈయన తల్లిదండ్రులు – నరసమాంబ, రామయ్యలు. కడపజిల్లా, జమ్మలమడుగు తాలూకా నెమళ్ళ దిన్నె గ్రామంలో జన్మించాడు.
ఈయన దుర్భాక రాజశేఖర శతావధానితో కలసి కొన్ని కాష్యనాటకాలు రాశాడు. గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతము” కావ్యం గుర్తుకు వస్తుంది. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్య కాంక్షను అణువణువునా రగుల్కొల్పిన మహాకావ్యం ఇది. ‘మురారి’. “పుష్పబాణవిలాసము’, ‘రఘునాథీయము’, ‘మల్లికా మారుతము మొదలైన కావ్యాలు, వాస్తు జంత్రి (అముద్రిత వచన రచన), శ్రీనాథ కవితా సామ్రాజ్యము’ (విమర్శ) ఈయన లేఖిని నుండి వెలువడ్డాయి. కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన’ అనే బిరుదులను