10th class telugu 4th lesson kothabata saramsam(summary)
Answers
Answer:
saramshan : kotha bata lesson
Answer:
Pls mark me as brainliest
Explanation:
పూర్వ కాలంలో పల్లెల పరిస్థితి :- నాడు పల్లెల్లో అగ్రకులాల వాళ్ళు మాత్రమే ఊరి రచ్చబండపైన కూచునేవాళ్ళు, మిగతావాళ్ళందరూ కింద కూచునేవాళ్ళు. అవసరాలకు అప్పు తీసుకుని వడ్డీకి వడ్డీ చొప్పున డబ్బులు కడుతూ బానిసత్వంతో బతికేవాళ్ళు. తక్కువ డబ్బులకే కూలీపనులు, చేతివృత్తి పనులు, పల్లకీలు మోయడం వంటి పనులను చేసేవాళ్ళు. పంచాయితీ పెద్ద చెప్పే తీర్పునే వేదవాక్కుగా భావించేవారు. అర్ధరాతుల్లో ఇళ్ళల్లో, చేలల్లో దోపిడీలు జరిగేవి.
పల్లెలో వచ్చిన మార్పు :- స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. స్వేచ్ఛను, సమానత్వాన్ని కోరుకున్నారు. ఒకరి కాళ్ళపై ఆధారపడటం, మోచేతినీళ్ళు తాగి బతికే పనులకు స్వస్తి, చెప్పారు. తమకష్టానికి తగిన ఫలితాన్ని కోరుకున్నారు. పల్లకీలు మోయడం మానుకున్నారు. డబ్బుల విషయంలో వారు మోసపోతున్నది తెలుసుకుని జాగ్రత్త పడ్డారు. పైకి తీయగా మాట్లాడి మోసంచేసే కుటిలవాజితనపు మనుషులకు బుద్ధిచెప్పారు. సాంఘిక దురాచారాలు అంతరించాయి. అందరూ చదువుకోవాలి అనే ఆలోచన వచ్చింది. వ్యక్తిగత శుభ్రత పెరిగింది. బతకడం నేర్చుకున్నారు. నలుగురికి బాసటగా నిలిచారు.