English, asked by shivasaiengineers, 11 months ago

11. ఈ కింది పొడుపు కథలను విప్పండి
1. అందరిని పైకి తీసుకు వెళతాను కాని నేను మాత్రం పైకి వెళ్ళలేను
2.నాకు కన్నులైతే చాలా ఉన్నాయి కాని నేను చూసేది మాత్రం రెండింటితోనే
8.వానాకాలంలో, ఎండకాలంలో విరిసే నల్లని కలువను నేను ( 2 )
4. ఊరంతా తిరిగి మూలన కూర్చునేవి ఏమిటి (
5.చక్కని రెక్కలు ఉన్నాయి కాని పక్షిని కాను, గిరగిర తిరుగుతాను కాని గానుగను
కాను నేను ఎవరిని
6.నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటిస్తుంది. ఈ ఓడ ఏమిటది ( )

Answers

Answered by suggulachandravarshi
13

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగువారిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.

ఇక నీ ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే,

పొడుపు కథలు:

1. అందరిని పైకి తీసుకు వెళతాను కాని నేను మాత్రం పైకి వెళ్ళలేను - నిచ్చెన.

2. నాకు కన్నులైతే చాలా ఉన్నాయి కాని నేను చూసేది మాత్రం రెండింటితోనే - నెమలి.

3. వానాకాలంలో, ఎండకాలంలో విరిసే నల్లని కలువను నేను - గొడుగు.

4. ఊరంతా తిరిగి మూలన కూర్చునేవి ఏమిటి - చెప్పులు.

5. చక్కని రెక్కలు ఉన్నాయి కాని పక్షిని కాను, గిరగిర తిరుగుతాను కాని గానుగను

కాను నేను ఎవరిని - గాలిపటం.

6. నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటిస్తుంది. ఈ ఓడ ఏమిటది - ఒంటె(ఎడారి ఓడ).

నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను...❣️❣️

Similar questions