12 అహింసా మార్గంలో ఎందుకు నడవాలి?
Answers
Answer:
కొన్ని దశాబ్దాల క్రితం జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన అహింసా మార్గం నేటికీ అనుసరణీయమేనని మార్టన్ లూథర్ కింగ్-3 అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో భారత్ ఒక ప్రత్యేకమైన, క్లిష్టమైన దేశంగా వెలుగొందుతోందన్నారు.
భారత జాతికి మార్గదర్శకమైన గాంధీజీ అహింసా మార్గం, సందేశాలను ఆసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉగ్రవాదం ప్రజ్వరిల్లుతున్న సమయంలో అహింసా విత్తనాలను ప్రపంచమంతటా చల్లాలని పిలుపునిచ్చారు. గాంధీజీ సూచించిన ప్రేమ, అహింసా మార్గాల ద్వారా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఆయన ప్రజలను కోరారు.
ఒకపుడు గాంధీజీ నివశించిన ఈ ప్రాంతానికి రావడం ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇకపోతే ఇరాక్‌పై అమెరికా దాడిపై ప్రస్తావించగా, కొన్ని విషయాల్లో అమెరికా అనుసరిస్తున్న విధానాలు సహేతుకంగా, నిర్ణయాత్మకంగా లేవని మార్టిన్ అభిప్రాయపడ్డారు. అనంతరం గాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠాన్ని మార్టిన్ సందర్శించారు.
Explanation:
Bro I already Answered To This Question Na!!!
And Can i Know Which Class You Are
Then It will Be Easy To Answer Your Questions