2 కిందయివ్వబడిన పొడుపు కథలకు సమాధానం చెప్పగలరా!
ఉదా :
ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు - నిప్పు
1. కాళ్ళు లేవు కాని నడుస్తుంది. కళ్ళు లేవు కాని ఏడుస్తుంది.
2 ఒకటే తొట్టి రెండు పిల్లలు
3. నల్ల కుక్కకు నాలుగు చెవులు .
తోలు నలుపు తింటే పులుపు
5. రొప్పుంది కానీ జుట్లులేదు. కళ్ళున్నాయి కానీ చూపులేదు.
6. సన్నని స్తంభం. ఎక్కలేరు దిగలేరు.
7. పొట్టలో వేలు, నెత్తిమీద రాయి.
8. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
9. అమ్మ తమ్ముడిని కాను. రాని మీకు నేను మామ.
10. ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంది.
Answers
పొడుపు కథలకు సమాధానలు :
1. కాళ్ళు లేవు కాని నడుస్తుంది. కళ్ళు లేవు కాని ఏడుస్తుంది.
మబ్బు / మేఘం
2. ఒకటే తొట్టి రెండు పిల్లలు .
వేరుశనగ
3. నల్ల కుక్కకు నాలుగు చెవులు.
లవంగం
4. తోలు నలుపు తింటే పులుపు .
చింతపండు
5. కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
కొబ్బరి కాయ
6. సన్నని స్తంభం. ఎక్కలేరు దిగలేరు.
సూది
7. పొట్టలో వేలు, నెత్తిమీద రాయి.
ఉంగరం
8. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
పెదవులు
9. అమ్మ తమ్ముడిని కాను. రాని మీకు నేను మామ.
చందమామ
10. ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంది.
చీపురు
Learn more :
1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...
https://brainly.in/question/19249131
2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3) 2) .... ..... దు డు ( 4)...
brainly.in/question/17212644
3) ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...
brainly.in/question/17782318
Answer:
హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగువారిని కలవడం ఎంతో సంతోషకరంగా ఉంది.
ఇక నీ ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే,
- మేఘం.
- వేరుశనగ.
- లవంగాలు.
- చింతపండు.
- కొబ్బరి.
- సూది.
- ఉంగరం.
- పెదాలు.
- చందమామ.
- చీపురు.