2) లేఖలు ఎన్ని రకాలు? అవి ఏవి ?
వివరించండి?
Answers
లేఖలు రాయడం ఒక కళ. కొన్ని లేఖలు చదువుతుంటే అది రాసిన మనిషే మన ముందుకొచ్చి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలాంటి లేఖలు రాయడానికి ఎంతో నైపుణ్యత ఉండాలి.
లేఖలు ముఖ్యంగా నాలుగు రకాలు.
అవి :
1) వ్యక్తిగత లేఖలు
2) వ్యాపార లేఖలు
3) అధికారిక లేఖలు.
4) సాంఘిక లేఖలు
1) వ్యక్తిగత లేఖలు
ఇవి స్నేహితుల మధ్య లేక బంధువుల మధ్య జరిగే సమాచార మాధ్యమంగా ఉపయోగపడుతాయి . ఇటువంటి ఉత్తరాలు రాయడంలో మనం ఎటువంటి ప్రత్యేక పద్దతి, కొత్తదైన మర్యాదలను పాటించవలసిన అవసరం లేదు. మనం మాములుగా ఎలా మాట్లాడుకుంటామో అలానే రాయవచ్చు.
2) వ్యాపార లేఖలు
వ్యాపార వాణిజ్యాల పరమైన విషయాలను అందచేసుకోవడానికై రాసే ఉత్తరాలు ఇవి. ఇవి ఎంత నైపుణ్యత మరియు నాణ్యతతో రాస్తే వ్యాపారపరమైన బలాలు అంత మెరుగుపడతాయి. ఇటువంటి లేఖలలో అప్రస్తుతమైన విషయాలు చర్చించరు. సందర్భాన్ని ఉద్దేశిస్తూ స్పష్టంగా, యదార్థంగా, సంక్షిప్తంగా ఈ లేఖలను రాస్తారు .
3) అధికారిక లేఖలు
ప్రభుత్వ సంబంధంగా లేక ప్రైవేటు కంపెనీల ఉన్నతాధికారుల పరంగా జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు అధికారిక లేఖలుగా పరిగణిస్తారు. ఈ లేఖలను, స్పష్టతతో, పరిపూర్ణంగా, సౌమ్యమైన భాషలో, సరళంగా, సంక్షిప్తంగా రాస్తారు. అప్రస్తుతమైన విషయాలు చర్చించడానికి ఇక్కడ తోవ ఉండదు. ఇది పూర్తిగా క్రమబద్దమైనది.
4) సాంఘిక లేఖలు
ఇటువంటి ఉత్తరాలు సర్వసాధారణంగా ఒక వర్గాన్ని గని ఒక గుంపుని గాని ఉద్దేశిస్తూ రాస్తారు. ఇవి ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా, వారి ఆలోచనలకు రూపం పోసినట్టుగా ఉంటాయి . విషయాన్ని తేలికైన పదాలలో లోతుగా రాస్తారు. ఇవి ఆహారపరమైన విషయాలు కావొచ్చు, సేవా పరమైనవి కావొచ్చు, సైన్స్, భాష, సమస్యల గురించి ఇంకా ఏవైనా కావొచ్చు. వరకట్నాలు లాంటివి , విద్య, వైద్యపరమైనవి, రాజకీయ విశ్లేషణలు కూడా వీటికిందకే వస్తాయి.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. Essay on telugu language in telugu.
brainly.in/question/788459
3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
Answer:
4 రకాలు
Explanation:
4 రకాలు 4 types 4 types