2. "సర్వేంద్రియాణం నయనం ప్రధానం" నేత్రదానం యొక్క ఆవశ్యకతను రాయండి.
Answers
Answer:
Explanation:
కొద్ది క్షణాలపాటు ఈ లోకమంతా చీకటి కమ్మేస్తే... ప్రాణం పోరునట్లు బాధపడతాం... అంత చీకటిని భరించలేక అల్లాడిపోతాం... కళ్లు నలుపుకుంటూ ఆ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తాం.. అటువంటిది పుట్టుకతో లేదా ప్రమాద వశాత్తు కళ్లు పొగొట్టుకున్న వాళ్లకు జీవితాంతం అన్ని క్షణాలు చీకటే.. ఎంతగా ఎదిగినా ప్రపంచాన్ని చూడలేమన్న బాధే...! అటువంటి వారికి చూపునిచ్చే అవకాశం మనేక వస్తే... మనం చనిపోరుున తరువాత కూడా మన కళ్లకు మరో జీవితం లభిస్తే.. అంతకన్నా ఆనందం మరొకటి వుండదు. మరి నేత్రదానం చేస్తే ప్రతిఒక్కరూ ఈ ఆనందాన్ని పొందవచ్చు.
దేశంలో ఇప్పటి వరకు 4.5 కోట్ల మంది అంధులు ఉన్నట్లు ఒక అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధుల సంఖ్యలో మూడోవంతు. ప్రతి ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే 1.60 కోట్ల కళ్లు ఏటామట్టిలో కలిసిపోతున్నాయి. ఈ కళ్లన్నింటినీ అంధులకు అందించగలిగితే ఐదేళ్లలోనే దేశంలో అందరికీ చూపు ప్రసాదించే అవకాశం ఉంది.
ప్రపంచ అంధత్వానికి పుట్టినిల్లుగా వెలుగొందుతున్న మన భారతదేశంలో తాజా నివేదికల ప్రకారం 15 మిలియన్ల మంది అంధులున్నారు. వీరిలో కొందరు పాక్షిక, పూర్తి శాతం అంధత్వం వున్నవాళ్లున్నారు. వీరిలో సగానికి పైగా సరైన వైద్య సదుపాయాలు దాతలు దొరికితే వారి జీవితంలో రంగులను సంతరించుకునే అవకాశం వుంది. అందుకే భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెప్టెంబర్ 8వతేదీని ‘నేషనల్ ఐ డొనేషన్ డే’ గా ప్రకటించింది.
మరో జీవితం...
జీవించి ఉన్నంత కాలం కంటి చూపును అనుభవించి.. మరణించాక మన శరీరంతో పాటు కళ్లను మట్టిలో కలిసిపోనీయకుండా వాటిని వేరొకరికి అమర్చేందుకు అంగీకరిస్తే చాలు.. చావు తర్వాత మన కళ్లతో వారికి చూపు కల్పించగలం. దీనికి కావాల్సింది ఒక్కటే మనలో చైతన్యం. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ శరీరంలో కొన్ని అవయవాలు లేకున్నా రోజులు గడిపేయగలం. కానీ కంటి చూపు లేకుంటే మాత్రం జీవితం ఎంత దుర్బరమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఈ రోజున కంటి చూపులేని వాళ్లు లక్షల్లో ఉన్నారు. మనమంతా తలచుకుంటే కొన్ని సంవత్సరాల్లో వారికి చూపును అందివ్వగలం.
చైతన్యంతో ఆలోచిస్తే... అది మన చేతుల్లో పనే. దేశంలో ఇప్పటి వరకు 4.5 కోట్ల మంది అంధులు ఉన్నట్లు ఒక అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధుల సంఖ్యలో మూడో వంతు. ప్రతి ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే 1.60 కోట్ల కళ్లు ఏటా మట్టిలో కలిసిపోతున్నాయి. ఈ కళ్లన్నింటినీ అంధులకు అందించగలిగితే ఐదేళ్లలోనే దేశంలో అందరికీ చూపు ప్రసాదించే అంకాశం ఉంది. కనీసం ఇందులో ఐదో వంతు కళ్లు సేకరించి అమర్చగలిగినా ఎంతో మందికి ఈ ప్రపంచాన్ని వాళ్ల కళ్లతో చూసే భాగ్యాన్ని కలిగించగలం. కొన్నేళ్లలోనే పూర్తిగా దేశంలోని అంధులందరికీ చూపు ప్రసాదించవచ్చు.
నేత్రదానంపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మద్రాసు మెడికల్ కాలేజీ ఒక కార్యాచరణకూడా రూపొందించింది. ఈ కాలేజీలోని నర్సింగ్ విద్యార్థులు వెయ్యి మందినిఖాళీ సమయాల్లో నేత్ర దానం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాల్లోపాల్గొనేందుకు సిద్ధం చేస్తోంది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఎనిమిది ఆస్పత్రులకు వచ్చే 16 వేల మంది అవుట్ పేషెంట్లు, 8 వేల మంది ఇన్‌పేషెంట్లకు నేత్ర దానం పట్ల అవగాహన కల్పించాలన్నది వారి కార్యక్రమ లక్ష్యం