మంచి వారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను వ్రాయండి ?
24,
దున్నే వారికే భూమి - అంటే మీకేమర్ధమయింది?
3, ఎవడొసన ముడి
OK
Answers
1. మంచి వారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను వ్రాయండి ?
జ. జమంచివారు అంటే సత్పురుషులు అనగా మంచి గుణాలు కలవారు. ప్రభువులు మంచివారిని ఆదరించి, వారికి ఉద్యోగమిచ్చి వారిని పెంచి పోషించాలి.
మంచి వారిని ఆదరించి పోషిస్తే, వారు సహృదయులు కాబట్టి, యజమానుల క్షేమానికి, వారి అభివృద్ధికి కృషి చేస్తారు. యోగ్యుడైన రాజు తన విచక్షణ జ్ఞానంతో ప్రజల మంచి చెడులను ముందుగా గుర్తించాలి.
మంచివారిని ప్రోత్సహించాలి. చెడును ఖండించాలి. మంచివారికి ఆశ్రయం కల్పిస్తే వారు ధర్మమార్గంలో సంసారాన్ని పోషించుకుంటారు. లోకోపకారానికి ప్రయత్నిస్తారు.
మంచివారినే మనం ఆదరిస్తే లోకంలో దుర్జనులకు ఆశ్రయం లభించదు. ఆ విధంగా లోకంలో దుష్టత్వం దూరం అవుతుంది. మంచిగా ఉందాం. మంచినే చేద్దాం. మంచివారినే ఆదరిద్దాం అనే భావం లోకంలో వ్యాపిస్తుంది.
2. దున్నే వారికే భూమి - అంటే మీకేమర్ధమయింది?
జ. ప్రజాస్వామ్య వ్యవస్థలో భూమి యాజమాన్య హక్కు వ్యక్తులకు వుంటుంది. ఈ హక్కు తల్లిదండ్రులనుండి పిల్లలకు వారసత్వం ద్వారా బదిలీ అవుతుంది. ప్రభుత్వం నమోదుల శాఖ ద్వారా భూమి హక్కులను నమోదు చేస్తూ హక్కులకు చట్టబద్ధతను కల్పిస్తుంది. సమాజావసరాలకోసం కేటాయించిన భూమి ప్రభుత్వ యాజమాన్యంలో వుంటుంది. వ్యక్తులకు హక్కు గలభూమికి గుర్తింపు పత్రాలు అనగా యాజమాన్యహక్కు పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం ప్రభుత్వం నుండి పొందవచ్చు. ఆదాయపు శాఖ ఆధ్వర్యంలో గల ప్రభుత్వ యంత్రాగం క్షేత్రస్థాయిలో భూమి వివరాలు అనగా సర్వే సంఖ్యలు, హద్దులు చూపే పటాలను నిర్వహిస్తుంది.