India Languages, asked by sahasra4562, 13 hours ago

24. "శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి” అని రామాయణం ఆధారంగా వివరించండి.
explain in telugu please answer fast to mark as a brainliest ​

Answers

Answered by jyoshnarayavarapu999
1

Answer:

తాను చేస్తున్న యాగాల రక్షణ కొరకై శ్రీరామ లక్ష్మణులను తీసుకెళ్లిన విశ్వామిత్రుడు, ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తరువాత వారిద్దరినీ మిథిలకు తీసుకుపోతాడు. అక్కడ జనకుడు యజ్ఞాన్ని చేస్తుంటాడప్పుడు. విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. మునీశ్వరుడిని సేవించాడు. ఆయన వెంటే వున్న రామ లక్ష్మణులెవరని ప్రశ్నించాడు జనకుడు. వారు దశరథ మహారాజు కొడుకులని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు క్రూరులైన రాక్షసులను చంపారని, వారిద్దరూ ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూసేందుకొచ్చారని అంటాడు విశ్వామిత్రుడు. మర్నాడు ఉదయం జనక మహారాజు ఆహ్వానం మేరకు శివ ధనస్సును చూసేందుకు వెళ్లారు రామలక్ష్మణులు. తన దగ్గరున్న ధనుస్సు విషయం చెప్పి, దానిని ఎక్కుపెట్టగల వాడికే తన కూతురు సీతను ఇస్తానని చెప్పాడు. దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపిస్తానని, శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే తాను అదృష్టవంతుడిని, అయోనిజైన సీతను ఆయన కిస్తాను అని అంటాడు.

    జనకుడి ఆదేశం ప్రకారం, ఐదువేల మంది బలశాలులు ఇనుప పెట్టెతో సహా దాంట్లో వున్న పెద్దవింటిని తెచ్చారు వారున్న చోటికి. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని-తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. విశ్వామిత్రుడు, జనకుడు అంగీకరించగానే, రాముడు, అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరూ చూస్తుండగా అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. ఆ వెం టనే నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్పగుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను’’ అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేశాడు కాని, రాముడందుకు అంగీకరించలేదు. తనను విశ్వామిత్రుడు చెప్పిన పని చేయాల్సిందిగా తన తండ్రి ఆజ్ఞాపించాడని, ఆయన వింటిని చూడమంటే చూసానని, ఎక్కుపెట్టమంటే పెట్టానని, అంటూ, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞ లేదని జనకుడికి చెప్పాడు. జనకుడు దశరథ మహారాజుకు కబురు పంపి ఆయన్ను పిలిపించాడు.

మిథిలా నగరం చేరుకున్న దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న  చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాక వంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. ఇది సాంప్రదాయ బద్ధంగా వచ్చే ఆచారం. తదనుగుణంగానే, వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు వెంటనే. ఆ తరువాత ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడు. శ్రీరామ లక్ష్మణులకు తన ఇద్దరు కూతుళ్లు సీత-ఊర్మిళలను సంపూర్ణ ప్రీతితో, దశరథుడి ఆజ్ఞ ప్రకారం ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటాడు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను, దశరథుడి కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయమని విశ్వామిత్రుడు సూచించగా దానినీ అంగీకరించాడు జనకుడు. రెండు రోజుల తరువాత వచ్చే ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున వివాహంచేద్దాం అని అంగీకారం కుదిరింది. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి భగుడనే ప్రజాపతి అనీ, ఆయన శుభకరుడు కాబట్టి, ఉత్తర ఫల్గుని ఉత్తమమని అందరు ప్రశంసించారు.

            

    ‘‘సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస/ ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్‌’’. అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో: ‘‘ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా / కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్‌’’. ‘‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్‌ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’’ అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు.

       సీతా కల్యాణ ఘట్టం చదివిన వారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘‘కౌసల్యా సుత’’ అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? సీ్త్ర పేరుతో పిలవకుండా, వాడుక పేరైన ‘‘రామా’’ అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. ‘‘ఈ సీత’’ అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణ మంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి ‘‘ఈ సీత’’ అని చెప్పాడు జనకుడు.

(వాసు దాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం ఆధారంగా)

-వనం జ్వాలా నరసింహారావు

(నేడు శ్రీరామనవమి)

Similar questions