25. కబంధహస్తాలు - ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి
Answers
Explanation:
ప్రశ్న :-
కబంధహస్తాలు-ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి?
జవాబు :-
కబంధహస్తాలు:-
కబంధుని చేతులు
అతి భయంకరమైన చేతులు
ఆ చేతులలో చిక్కుకున్న వారు బ్రతకలేరు
అతి కిరాతనమైన చేతులు (వ్యక్తులు)
జాతియం -నేపద్యం:-
కబందం లేక కబందుడు అనగా ఒక రాక్షసుడు పేరు.
ఈ పాత్ర వాల్మీకి వ్రాసిన రామాయణం లో అరణ్యకాండం చివరి భాగంలో ఉంది.
శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతమ్మ వారిని లంకాధిపతి రావణాసురుడు చేరబట్టి లంకకు తీసుకుని వెళ్లిన తరువాత శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సీతమ్మ వారిని వెతుకుతూ దండకారణ్యం నుండి వెళుతూ వుంటారు.
అలా దండకారణ్యం దాటి కౌచితారణ్యం చేరుకుని ఉన్న తరుణంలో ఒక వికృత రూపంలో ఉన్న అతి పెద్ద చేతులు వారిని పట్టుకుంటాయ్ అప్పుడు ఆ రెండు చేతులను వారు నరికిన తరువాత ఆ చేతులు ఎవరివి అంటూ వెతుకుతూ వెళ్లిన వారికి తలా ,కాళ్ళు లేని పొట్ట భాగం లో పెద్ద నోరు ఉన్న ఒక వికృత రూపం కనిపిస్తుంది.
ఆ చేతులు 8 యోజనాల పొడవు ఉంటాయి. ఆ విధంగా ఆ చేతులు కబందుడ వని గ్రహిస్తారు.ఆ విధంగా కబంధుడి ప్రస్తావన ఉంటుంది.
అర్ధం:-
కబంధుడు తన పొడవాటి చేతులతో అడవిలో ఉన్న ప్రతి జంతువుని పట్టుకుని తినేవాడు.కాబట్టి అతిని చేతుల్లో చిక్కుకున్న వాళ్ళు బ్రతికి బయటపడేవారు కాదు.
కబంధ హస్తాలు అనగా కబంధుడి హస్తాలు .
ఆ చేతుల్లో చిక్కుకున్న వారు తప్పించుకోలేరని అర్థం .
ఈ విధం గా ఆ జాతియం వచ్చింది.
ఉదాహరణలు :-
1) నేటి సమాజంలో ఆడవారు కబంధ హస్తాలాల్లో బలి అవుంటున్నారు.
2) ప్రభుత్వ భూములను కొందరు తమ కబంధ హస్తాల్లో ఉంచుకుంటున్నారు .
3) రోజు మన దేశము లో అనేక పేదవారు ధనికులు కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు.