3. కొమురం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను వ్రాయండి.
Answers
Answer:
Explanation:
కొమురంభీం అస్సాం తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు. అక్కడ అనేక అబుభవాల్లో
ప్రపంచాన్ని అర్ధం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్ట జీవులకు బాధలు తప్పవని, కష్టపడే వానికి కడుపు
నిండటం లేదనీ బీమ్ తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్దతిన భీం తేయాకు తోటల్లో కష్టపడి
పనిచేసాడు. అక్కడ చెమట తుడుచుకోడానికి లేచిన కార్మికులను, మేస్త్రీలను కొరడాలతో కొట్టేవారు.
వారి సంపాదన వారి మందులకె సరిపోయేది కాదు. తోటల యజమానులుకు కొంచెం కూడా
దయాగుణం ఉండేది కాదు.
ఇవన్నీ చూస్తున్న భీం కు అసంతృప్తి రాజుకుంది. భీం అస్సాంలో నాలుగు సంవత్సరాలు ఉన్నాడు.
అక్కడే బీమ్ మన్యం నుండి వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో
పరిచయం అయ్యింది. అతడి ద్వారా భీం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు
జరిపిన పోరాటం రీతుల్ని భీం అర్ధం చేసుకున్నాడు. యువకులకు యుద్ధ రీతుల్ని రామరాజు ఎలా
నేర్పాడో తెలుసుకున్నాడు.
అడవులపై తమకు తప్ప ఇంక ఎవరికీ అధికారం లేదనీ గిరిజనులతో చెప్పించిన రామరాజు యొక్క
గొప్పతనము భీం అర్ధం చేసుకున్నాడు. మన్యం ప్రాంత ప్రజల్ని సమీకరించిన విధం
తెలుసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే పద్ధతిని భీం గ్రహించాడు. యుద్ధ
మెళుకువలని భీం గ్రహించాడు. క్రమంగా భీం ఎక్కుపెట్టిన బాణంలా తయారయ్యాడు.
ఈ సమయంలో తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రితో భీం తగువు
పెట్టుడున్నాడు. మేస్త్రీలు కొరడా భీం పైకి ఎత్తాడు. భీం వారిని
చితక కొట్టాడు. తోటల యజమాని పోలీయులతో చెప్పి బీమ్ ను జైల్లో వేయించాడు.భీం జైలు నుండి
తప్పించుకొని సొంత ఊరు వెళ్ళాడు.
Answer:
this is the ANSWER కొమురం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను వ్రాయండి.