3. తెలంగాణా పల్లెలు-సంస్కృతి సారాంశం రాయండి ?
Answers
తెలంగాణ పల్లెలు-సంస్కృతి
తెలంగాణ సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్రను కలిగివుంది. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులచే, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజవంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు.
భారత ఉపఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవిర్భవించింది. కళలు, సంస్కృతిలపై ఆసక్తి కలిగిన పాలకులు, ఇతరులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి.
ఈ ప్రాంతంలో "కాకతీయ పండుగ" తోపాటుగా బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మీలాద్-ఉన్-నబి, రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుకలను కూడా జరుపుకుంటారు.
విభిన్న భాషలు, సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం చాలాకాలం నుండి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. "దక్షిణానికి ఉత్తరం, ఉత్తరానికి దక్షిణం" గా, గంగా-యమున తెహజీబ్ గా పిలవబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నగరం.