5. గంగానది (సమాసనామం)
Answers
Answer:
సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది - గంగ అను పేరు గల నది - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం.
సమాసాలు:
వేరు వేరు అర్దాలు కలిగిన రెండు పదాలను కలిపి ఒకేఒక పదంగా రాయటాన్ని సమాసం అంటారు లేదా రెండు అర్ధవంతమైన పదాలను ఏక పదంగా రాయటాన్ని సమాసం అంటారు.
ఇందులో మొదటిగా వచ్చే పదాన్ని పూర్వ పదం అని చివరిగా వచ్చే పదాన్ని పరపదం అని అంటారు.
సంభావన పూర్వపద కర్మధారయ సమాసం:
సంభావన అనగా అర్ధం పేరు లేదా ఊహ లేదా సంజ్జ్ఞ.
ఒక పద పూర్వ పదమున స్తానం లో సంభావన (పేరు) వచ్చినట్లయితే ఆ సమాసమును సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా పేర్కొంటారు.
ఉదాహరణ:
ద్వారకానగరం - ద్వారకా అను పేరుగల నగరం
మామిడి చెట్టు - మామిడి అను పేరుగల చెట్టు
ఎవరెస్ట్ పర్వతం - ఎవరెస్టు అను పేరుగల పర్వతం
కాకినాడ పట్టణం - కాకినాడ అను పేరుగల పట్టణం
పై ఉదాహరణలు అనుసరించి
గంగానది - గంగ అను పేరు గల నది - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం.
#SPJ2