5 poems in telugu on studies with meanings
Answers
కలుష చిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంట కుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమా!
చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి నీ జీవితానికి వస్తుంది కొత్త వెలుగు.
చదువుజదువుకున్న సౌఖ్యంబులునులేవు
చదువుజదివెనేని సరసుడగును
చదువుమర్మమెరిగి చదువంగచూడుము
విశ్వదాభిరామ వినురవేమ!
చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్ బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్పు, వాడుకు
వచ్చునదే కీడు సుమ్ము! వసుధను సుమతీ!
hope it helps you. . . . . . mark as a brainlist. . . follow me. . . .
1) విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే..?
తాత్పర్యం:- విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.
విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. సలకుల చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం.
2) శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
తాత్పర్యం:- శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి.
3) చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!
తాత్పర్యం:- హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు- “బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.
4) చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్
బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
తాత్పర్యం:- ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు
5) ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
తాత్పర్యం:- మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతోదగ్గరకు రమ్మనిపిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనేచేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు, కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది..