5 poems of education with meaning in Telugu
Answers
Answered by
27
★చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్
బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
భావం - ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు
★విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!
భావం - విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. సలకుల చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం.
★చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!
భావం - హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు- “బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.
★చదువుజదువుకున్న సౌఖ్యంబులునులేవు
చదువుజదివెనేని సరసుడగును
చదువుమర్మమెరిగి చదువంగచూడుము
విశ్వదాభిరామ వినురవేమ!
★చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి నీ జీవితానికి వస్తుంది కొత్త వెలుగు.
Hope it helps

rishilaugh:
thanks for nice poem :)
Answered by
1
hope this help you
mark me as BRAINLIEST please
Attachments:
Similar questions
Sociology,
8 months ago
Math,
8 months ago
Sociology,
8 months ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago