India Languages, asked by hannan1, 1 year ago

5 poems on chaduvu with meaning

Answers

Answered by kvnmurty
10
.ఇవి నేను రాసినవి.


   
విద్యలేనివాడు  వింత పశువు తో సమానం 
   
విద్యా దానం అతి ఉత్తమదానం
   
బడి కి పోరా  బడి కి పోరా  చదువు కోరా చదువుకోరా
   
జీవితంలో అదే నిన్ను ముందరికి తీసుకెళ్లెరా!

     
ఇది ఇరవైఒక శతాబ్దంరా
         
నీ స్థితి ఏంటో చూసుకోరా, చదవరా,
       
మంచి పనికొచ్చే జ్ఞానం సంపాదించరా
     
కృషి చేయరా,  ధనం వెనకేయరా !
       
ఎన్నెన్నో పనులు చదువు తెలివి వల్లసాధ్యం రా!
     
నిశిత బుద్ధి వాడి నీ  ప్రపంచాన్ని జయించరా ! 
         
బుద్ధి లేని చదువు వ్యర్ధంరా. 

====================

ఇది సుమతి శతకం లోని ఒక పద్యం.

1) 
తనయూరి తపసి తనమును
తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్
తన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!
 
     
జనరల్ గా మనుషులు  తన సొంత ఊరిలోని ఋషిని , తన సొంత కొడుకు తెలివి తేటలని, కొడుకు చూపించే విద్యని , తన భార్య అందాన్ని ,  పెరడులోని చెట్టు కున్న ఔషధగుణాన్ని, గొప్పగా ఎక్కువగా చెప్పరు.  ఇలాంటి వాళ్ళు ఎలాంటిమనుషులు    సుమతీ..

===============

2)  
లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
    
      
మంచిబుద్ధికలవాడా! శరీర బలం ఉన్నవాని కంటె తెలివితేటలు ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసిదానిమీదకు ఎక్కగలడు. కండలు తిరిగి, శరీరం దృఢంగా ఉండి బలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న నీతిమంతులు కూడా ఉంటారు. 
==================
చదువు చాలా ముఖ్యం అని చెప్పే సుమతీ పద్యం.


3.  
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

   
మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి.   కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి.   తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మనిపిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు,  కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది..
=============================
పోతన పద్యం.   మహాభాగవతం లో 

4.  
చదువని వాడజ్ఞుండగు 

చదివిన సదసద్వివేక చతురత గలుగున్ 
చదువగ వలయును జనులకు 
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ! 

ఇది  ఆంధ్ర మహా భాగవతంలో పోతన చెప్పించిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటి.   హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు-    “బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.

============================
5.  

ఏనుగు లక్ష్మణ కవి పద్యం:

విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్ 
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్ 
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్ 
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?! 

సుభాషిత రత్నావళి  లో :   “విద్య రహస్యంగా దాచిపెట్టుకున్న డబ్బులాంటిది. మనుషులకు విద్యే అందం. విద్య వల్లనే కీర్తి-ప్రతిష్ఠలు కలుగుతాయి. అన్ని సుఖాలనూ అందజేసేది విద్యే. విద్య గురువులాగా వివేకాన్నిస్తుంది. విదేశాలలో‌మనకు చుట్టం విద్యే. విద్య అన్నిటికంటే గొప్ప దైవం. విద్యకు సాటివచ్చే సంపద ఈ లోకంలో మరేదీ‌లేదు. రాజాధిరాజుల చేతకూడా పూజింపబడుతుంది విద్య. అంత గొప్పదైన విద్యను నేర్చుకోనివాడు అసలు మనిషేనా? కాదు” 

=================
6.

   
చదువు రాని వాడి వని దిగులుచెందకు
       
మనిషి మదిలోని మనసు , మమత, ప్రేమ లేని చదువు లెందుకు ?  

Similar questions