World Languages, asked by krishnapandey12, 1 year ago

5 sentence about golconda in telugu

Answers

Answered by simran108
6
 గొల్కోండ కోట రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్లదూరంలో ఉంది.ఈ ప్రాంతాన్ని క్రీ"శ 1083 నుండి 1323 వరకూ కాకతీయులు పరిపాలించారు. గోల్కోండ అసలుపేరు గొల్ల కొండ.దీనికి ఈ పేరు రావడానికి చిన్న కధ ఉంది.ఇక్కడ గొర్రెలు కాసుకునే గొర్రెలకాపరికి మంగళవారం అనే కొండపై దేవతావిగ్రహం కనపడిందంట.ఈ విషయాన్ని కాకతీయరాజులకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారట.కాలక్రమంలో గొల్లకొండ గొల్కోండగా రూపాంతరం చెందింది.చాలాకాలంవరకూ ఇది కాకతీయుల అధీనంలో ఉండేది.అయితే యుధ్దసమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కోడ కోట అజీం హుమాయూన్ వశమయ్యింది.దీనితో ఈకోట మహ్మదీయిల చేతిలోనికి వెళ్ళింది.తరువాత కాలంలో అనేక రాజుల చేతులు మారి 15న శతాబ్ద సమయంలో కుతుబ్ షాహీ రాజుల చేతులోకి వెళ్ళగా వారు ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే నల్లరాతి కొటను కట్టించారు.తరువాత కుతుబ్ షాహీ వంశస్తులను ఔరంగజేబు జయించి ఈకోటను కొంతభాగం వరకూ నాశనం చేశాడు.దీనితో ఇక్కడ పాలన కాలగర్బంలో కలిసిపోయింది.

    ఈకోట ప్రస్తుతం ఎంతో చరిత్రను తనలో ఇడుమడింపచేసుకుని బావితరాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.ఈకోటను 120మీటర్లు ఎత్తుకలిగిన నల్లరాతికొండపై నిర్మించారు.గోల్కోండను శత్రువుల నుండి రక్షించుటకు దీనిచుట్టూ పెద్దబురుజును నిర్మించారు.ఇది 87 అర్దచంద్రకార బురుజులతో 10 కిలోమీటర్లు కొట చుట్టూ కట్టబడింది.ఈకోటలో నాలుగు ప్రధాన సిమ్హద్వారాలు,అనేక రాజమందిరాలు,దేవాలయాలు,మసీదులు కలవు.కోటలోనికి శత్రువులు ప్రవేశిచినపుడు పైవారికి సమాచారము చేరవేయుటకు ధ్వని శాస్త్రము అధారంగా అద్భుతంగా నిర్మించారు.ఇక్కడ నుండి చప్పట్లు కోడితే కిలోమీటరు దూరంలోని కోట లోపల ఉండే బాలా మిస్సారు వద్ద ఈ శబ్దం చాలా చక్కగా వినపడుతుంది.ఇక్కడనుండి కోటలోనికి చేరుకోవడానికి 380 రాతిమెట్లు కలవు.కొటలోనికి నీటిని అప్పటిలోనే ప్రత్యేక విధానం ద్వారా పైకి చేరవేసేవారట.ఈకొటలోనుండి నగరంలో ఉన్న చార్మినార్ కు గుర్రం పోయేటంత సొరంగమార్గం ఉందని ప్రచారంలో ఉంది.

    ఈ కోటలో కాకతీయులచే నిర్మించబడిన ప్రాచీన దేవాలయాలు కలవు.వీటిని పాతకాలం నాటి గండశీలతో నిర్మించారు.అంతే కాకుండా ఈ కోటలోనే శ్రీరామదాసుగా పిలువబడే కంచర్లగోపన్నను భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు తానిషా కారాగారంలో భందించాడు.ఈ కారాగారంలో రామదాసుచే గోడలపైన చెక్కబడిన సీతారామ,లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు.హీందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా కలవు.
ఈ భావితరాలకోసం పరిరక్షించుటకు దీనిని పురావస్తుశాఖవారు రమ ఆధీనంలో పరిరక్షిస్తున్నారు.కోటను చూడటానికి ప్రతిరోజు ఎంతోమంది సందర్శకులు దేశ విదేశాలనుండి వస్తారు.వారి కోసం అలనాటి కోట విశేషాలు తెలియచెప్పే సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటుచేయబడుతుంది.దీనిని తెలుగు,హిందీ,ఇంగ్లీషు భాషల్లో ప్రదర్శిస్తున్నారు.
షో ప్రదర్శించు సమయాలు -
ఇది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ సాయంత్రం 6.30కు మొదలవుతుంది.మార్చినుండి అక్టోబర్ వరకూ 7గంటలకు స్టార్ట్ అవుతుంది.ఈ షో మొత్తం 55ని"లు ఉంటుంది.

Similar questions