5 sentences about father in telugu
Answers
తల్లి తండ్రులు దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. వారు చూపే ప్రేమ ఎవ్వరూ చూపరు. వారు కొన్ని సార్లు పిల్లలకోసం వారి జీవితాలను త్యాగం చేస్తారు. పిల్లల ఆనందమే వారి ఆనందంగా భావిస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి ఊహ వచేంతవరకూ వారే అన్నీ చేస్తారు. తల్లి తండ్రులు పిల్లలకు ఎంతో ప్రేమతో గోరుముద్దలు పెడతారు. మన జీవితమే వారి జీవితంగా భావించే ఏ భంధమైనా ఉంది అంటే అది తల్లితండ్రుల భంధమే. ఇది కేవల భంధం మాత్రమే కాదు, ప్రేమానురాగాల అనుభంధం.
వారిప్రేమలో స్వార్ధం ఉండదు. కల్మషం ఉండదు. వారి కష్టార్జితాన్ని అంతా పిల్లల కోసమే ఉపయోగిస్తారు. పిల్లల చదువుల కోసము, వారి భవిష్యత్తు కోసము మాత్రమే ఉపయోగిస్తారు. పిల్లలు పెద్దవాల్లైన తర్వాత వాల్లని చూస్తారా లేదా అని కూడా ఆలోచించకుందా మోత్తం సంపాదన అంతా పిల్లలకోసమే ఉపయోగిస్తారు. మనం బాగా చదువుకుని గొప్పవాల్లమైతే మొదటిగా సంతోషించేది తల్లితంద్రులే. అందుకే మాత్రుదేవో భవ, పిత్రుదేవో భవ అని అంటారు. తల్లితండ్రులు మనకు కనిపించే దేవుల్లవంటివారు.
అమ్మ అనే పదానికి మించిన మరో పదం ఈ సృష్టిలోనే లేదు. ప్రసవ సమయంలో పడ్డ భాధనంతా పిల్లను చూడగానే మరిచిపోతుంది అమ్మ. 24 గంటలూ పక్కనే ఉండి చూసుకుంటుంది అమ్మ. పిల్లలకు దెబ్బ తగిలితే ఏడుస్తుంది అమ్మ. పిల్ల్లలకు అనారొగ్యమొస్తే నిద్ర మాని మరీ జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ. స్కూల్ కి పిల్లలను పంపడానికి తెల్లవారుజామునే లేచి మధ్యాహ్నానికి భోజనం సిద్దం చేసి పెడుతుంది. స్కూల్ నుండి తిరిగి ఇంటికి రాగానే దగ్గరకు చేర్చుకుని పిల్లల కబుర్లు వింటూ ఆనందిస్తుంది అమ్మ.
తండ్రి గురించి చెప్పాలంటే పిల్లల భవిషత్తు బాగుండాలని నిరంతరం కృషి చేసే వ్యక్తి తండ్రి. పిల్లల చదువుకోసం, అవసరాలకోసం సంపాదన అంతా వెచ్చిస్తాడు. డొనేషన్లు కట్టి మరీ వారిని మంచి ఉన్నతమైన పాఠశాలల్లో చదివిస్తాడు. ఎల్లప్పుడూ పిల్లల్లు, కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి తండ్రి మాత్రమే. తండ్రి ఎల్లప్పుడూ తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచిస్తాడు. పిల్లల కోసం ముందుగానే మంచి ఇంటిని సిద్దం చేస్తాడు. పిల్లలు కష్టపడకూడదని తను కష్టపడి పిల్లలకు ఆస్తిని అంతస్తును సమకూరుస్తాడు.
ఈ సృష్టిలో గొప్ప అనుభందం స్నేహం అని ఏవరైనా భావిస్తే మన జీవితంలో మొట్టమొదటి స్నేహితులు మన తల్లితండ్రులు. తల్లితండ్రుల గురించి,వారి ప్రేమ గురించి చెప్పడానికి గాని వివరించడానికి గాని మన జ్ఞానం సరిపోదు. అటువంటి తల్లితండ్రులను ముసలివాల్లయ్యాక ఓల్డ్ ఏజ్ హోంస్ లో విడిచిపెడుతున్నారు పిల్లలు. కనీసం ఈ వ్యాసం చదివాక ఐనా వారిని ప్రేమతో చూసుకుంటారని ఆశిన్నాను.
☺️Mark my answer as BRAINLIEST ☺️
no
నా తండ్రి నా బెస్ట్ ఫ్రెండ్. నా తండ్రి ప్రపంచంలోనే అత్యుత్తమ తండ్రి. నా తండ్రి నాకు సూపర్ హీరో. నా తండ్రి ప్రతిదీ