India Languages, asked by siri6081, 6 months ago

సవర్ణధీర్ఘ సంధి, సరళాదేశ సంధి యొక్క సూత్రం రాసి 5 ఉదాహరణలు రాయండి.

Who knows telugu language answer it.Bcoz it is telugu language.

Don't spam ❎

Spam ❌=report.​

Answers

Answered by AkashMello
18

సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ -ల కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.( వివరణ: అ, ఇ, ఉ, ఋ, మరియు ఆ, ఈ,ఊ, ౠ, అక్షరములు తో అవే అక్షరములు కలిసి అదే అక్షరము దీర్ఘాక్షరముగా నేర్పడును. దానిని సవర్ణ దీర్ఘ సంధి అని అందురు.

ఉదాహరణ1 : అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ); రామ + అనుజుడు= రామానుజుడు

ఉదాహరణ2 : అకారము: రాజ+ఆజ్ఞ = రాజాజ్ఞ (అ+ఆ)/

ఉదాహరణ3 : ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)

ఉదాహరణ4 : ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)

ఉదాహరణ5 : ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)

సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములమగు.

ఉదా: పూచెను + కలువలు, పూచెను గలువలు: పరుషమైన కకారం సరళంగా (గ) మారింది.

ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషణలు విభాషనగు. పూచెను + గలువలు - పూచెంగలువలు; పూచెన్గలువలు: పూచెనుగలువలు, పూచెగలువలు అనే నాలుగు రూపాలు వస్తాయి. సమాసములందు స్వత్వ సంశ్లేషణ రూపాలుండవు. అర సున్నా రూపం మరో సూత్రంతో నిషేధానికి గురైంది. ‘పూచెంగలువలు’ అనే ఒక్క రూపం మాత్రమే మిగులుతుంది.

ఇది నీకు ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నా.

నన్ను Brainliest గా సెలెక్ట్ చెయ్యు.

Answered by crazyjosh
3

Answer:

అనగ : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం ఏకాదేశంబగుట సంధియనం బడు.

వివరణ :పూర్వస్వరం, పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : . ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

2. ఎవరక్కడ - ఎవరు + అక్కడ ( ఉకార సంధి )

ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.

ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.

అతడిక్కడ

అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)

అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)

అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)

అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)

అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)

అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)

ఇదే సంధి ప్రాథమిక సూత్రం.

సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.

రాముడు + అతడు = రాముడతడు అయినది.

సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.

మరికొన్ని ఉదాహరణలు:

1.రామ+అయ్య=రామయ్య, 2.మేన+అత్త=మేనత్త.

వర్ణాలబట్టి సంధులు రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి.

భాషనిబట్టి సంధులు రెండు రకములు: 1.సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.

siri nanu Naveen ani antaru ni number miss ayindhi ni degara na number vunte msg chasthava lekapote paravaledhu main ga ela vunav em chasthunav

సవర్ణధీర్ఘ సంధి, సరళాదేశ సంధి యొక్క సూత్రం రాసి 5 ఉదాహరణలు రాయండి.

Similar questions