Math, asked by sahadevparmar80, 6 months ago

(6) Complete the word-chain of 'Nouns'. Add four words, each beginning with the last
SECTION I: LANGUAGE STUDY
(2)
(Word-Chain)
Q.1 (A) Do as directed.
letter of the previous word.
accept -t
t.
Complete the word-chain of ‘nouns’. Add four words, each beginning with the last
letter of the previous word.
medicine
e....
(1)
m....
(2)
room
►y..
(3)
story
(4)
S.....
physics
d.....
(5)
world​

Answers

Answered by koyalavimalagmailcom
1

Answer:

ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి పరిశీలించవచ్చు. ఇలా విడగొట్టిన భాగాలకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఇటువంటి భాషాభాగాల పేర్లలో ముఖ్యమైనవి: నామవాచకం (noun), సర్వనామం (pronoun), విశేషణం (adjective), క్రియ (verb), విభక్తి ప్రత్యయం (post position). ఈ భాగంలో సర్వనామము (Pronoun) తెలుసుకొందాం

నామవాచకం (Noun) కు బదులుగా వాడబడేది సర్వనామము (Pronoun). సర్వము అంటే అన్నీ, అంతా అని అర్ధము.

ఉదాహరణలు

అతడు – ఇతడు – అది – ఇది – ఆమె – ఈమె – అన్ని – ఇన్ని – ఎన్ని – కొన్ని – కొంత – ఆ – ఈ – ఏ – నీవు – నేను – మీరు – మేము – మనము – వారు – ఎవరు – ఏది – తమరు – తాము – తాను – వాడు – వీడు.

రకాలు

1. సంబంధ సర్వనామము

సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం “సంబంధ సర్వనామం”.

ఉదాహరణ : ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఇందులో ఎవడు-వాడు అనే రెండు సర్వనామాలు పనిచేయడానికి దోషి అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఇవి మరియు ఇలాంటివి సంబంధ సర్వనామాలు.

2. విశేషణ సర్వనామము

సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు “విశేషణ సర్వనామాలు”.

ఉదాహరణ : అందరు అందరు కారు. ఇందులో అందరు అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం.

3. సంఖ్యావాచక సర్వనామము

సంఖ్యలను తెలియజేసే సర్వనామాలు “సంఖ్యావాచక సర్వనామాలు”.

ఉదాహరణ : ఒకరు – ఇద్దరు – ముగ్గురు – నలుగురు మొదలైనవి సంఖ్యావాచక సర్వనామాలు.

4. సంఖ్యేయవాచక సర్వనామము

ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి. కాని, నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక “సంఖ్యేయవాచక సర్వనామం”.

ఉదాహరణ : వారు ముగ్గురూ వీరే. ఇందులో ఆ ముగ్గురూ పురుషులా, స్త్రీలా అనేది చెప్పబడనందున ఇది సంఖ్యేయవాచక సర్వనామం.

5. పురుషలకు సంబంధించిన సర్వనామం

ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలు మూడు. వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి “పురుషలకు సంబంధించిన సర్వనామాలు”.

ఉదాహరణ : ప్రథమ పురుష : వాడు – వారు; మధ్యమ పురుష : నీవు – మీరు; ఉత్తమ పురుష : నేను – మేము – మనము

6. నిర్దేశాత్మక సర్వనామము

నిర్దేశించటం అంటే ఇది అని నిర్దేశించి చెప్పటం – అలాంటి సర్వనామాలు “నిర్దేశాత్మక సర్వనామాలు”.

ఉదాహరణ : ఇది – ఇవి – అది – అవి

7. అనిర్ధిష్టార్థక సర్వనామాలు

Similar questions