India Languages, asked by DebarghyaSen9697, 1 year ago

7 wonders of the world in telugu

Answers

Answered by shilpa69
2
I hope this helps you
Attachments:
Answered by dassristi2016
2
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మయన్ దేవాలయం ఉండే పట్టణం – చిచెన్ ఇట్జా, మయన్ నాగరికతలో ఒక రాజకీయ మరియు ఆర్ధిక కేంద్రంగా విలసిల్లింది. దీని వివిధ కట్టడాలు – కుకుల్కన్ లోని పిరమిడ్, చాక్ మూల్ దేవాలయం, వెయ్యి స్ధంభాల హాలు, అలాగే ఖైదీల క్రీడా ప్రాంగణం – ఈ నాటికి కూడా చూడవచ్చు. ఇవి అసాధారణమైన నిర్మాణనైపుణ్యానికి, నిర్మాణకళా సమ్మేళనానికి తార్కాణాలుగా నిలిచిపోతాయి. మయన్ దేవాలయలన్నింటిలోను, చివరిదైన ఈ పిరమిడ్ సహేతుకంగా, తార్కికంగా చెప్పాలంటే, అత్యంత ప్రసిధ్దమైనది.క్రీస్తు రిడీమర్ (1934), రయో డి జనీరో, బ్రెజిల్

కార్కోవాడో పర్వతం పై ప్రతిష్టింపబడిన సుమారు 38 మీ. పొడవుగల జిసెస్ విగ్రహం పైనుండి రయో డి జనీరోను గమనిస్తున్నట్లుగా ఉంటుంది. హీఇటర్ డ సిల్వా కోస్టా అనే బ్రెజిలియన్ చే రూపకల్పనచేయబడి, ఫ్రెంచి శిల్పి పాల్ ల్యాండోవిస్కీ చేత మలచబడిన ఈ విగ్రహం ప్రపంచలోనే అతి ప్రాచుర్యం పొందిన ఒక స్మారక కట్టడం వంటిది. ఈ విగ్రహనిర్మాణానికి ఐదేళ్లు పట్టింది, ఇది అక్టోబరు 12, 1931 నాడు ఆవిష్కరించబడింది. ఇది ఈ పట్టణానికే ఒక సంకేతంగా నిలిచిపోయి, చేతులు చాచి, సందర్శకులను సాదరంగా ఆహ్వానించే బ్రెజిల్ దేశస్ధుల యొక్క స్నేహపూర్వక ఆదరణకు చిహ్నంగా నిలిచిపోయింది.
రోమన్ కలోసియమ్ (ఒక పెద్ద ప్రదర్శనశాల వంటిది) – (70-82 క్రీ.శ.), రోమ్, ఇటలీ.

రోమ్ నగరానికి మధ్యగా ఉండే ఒక ప్రముఖ యాంఫిథియేటర్ (వృత్తాకారంలో ఉండి, పైకప్పు ఉండనటువంటి ఒక క్రీడారంగ/రంగస్ధల ప్రదేశం వంటిది) యుధ్దంలో పాల్గొని, గెలిచే యోధులను ఆదరించి, వారికి అభిమానం చూపించేందుకు, రోమన్ సామ్రాజ్య వైభవాన్ని ఆనందోత్సాహాలతో గడుపుకుంటూ ఉండేందుకు నిర్మితమై ఉంది. దీని నిర్మాణ రూప కల్పన, ఈ నాటికి కూడా ఆదర్శంగా నిలిచిపోయి, 2000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి, ప్రతి ఆధునిక క్రీడా ప్రాంగణం కూడా ఈ కలోసియమ్ కు గుర్తుగా నిలిచేపోయేటట్లుగా, మరల్చుకోలేని, దాని సహజ అందానికి ప్రతీకగా ఉంది. ఫిల్ముల ద్వారా, చారిత్రిక గ్రంధాల ద్వారా ఈ నాడు మనం వీటిని గురించి, ఈ ప్రాంగణంలో కేవలం ప్రేక్షకుల ఆనందం కోసం నిర్వహింపబడుతూవుండే వివిధ క్రీడలను, హింసాత్మకమైన ఒళ్లు గగుర్పొడుస్తూ వుండే ముష్టియుధ్దాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటూనే ఉన్నాము.

తాజ్ మహల్ (క్రీ.శ. 1630), ఆగ్రా, ఇండియా.

గతించిన తన ప్రియతమ భాగస్వామి సంస్మరణార్ధం 5వ ముస్లిం మొఘల్ చక్రవర్తి షా జహాన్ యొక్క ఆదేశాలపై నిర్మింపబడిన జగద్విఖ్యాతి గాంచిన ఈ గొప్ప సమాధి వంటి నిర్మాణం చేపట్టబడింది. చలువరాతితో కట్టబడి, ఒక పధ్దతి ప్రకారం బృందావనపు గోడలతో నిర్మింపబడ్డ అందాలతో అలరారుతూ ఉండే తాజ్ మహల్ భారతదేశంలో ముస్లింల కళాసంపదలో ఒక విశిష్టమైన వజ్రం లాగ కొనియాడబడుతోంది. తదుపరి కాలంలో ఈ చక్రవర్తి జైలులో పెట్టబడినా, తనను ఉంచిన చిన్న జైలు గవాక్షం నుండి తాజ్ మహల్ అందాలను ప్రేమతో చూస్తూవుండే వాడని ప్రతీతి.

ప్రఖ్యాతి గాంచిన చైనా గోడ (క్రీ.పూ. 220 మరియు క్రీ,శ, 1368-1644), చైనా

ప్రస్తుతం ఉండే దానిని ఇంకా పటిష్ట పరచడానికి, మరింత రక్షణనిచ్చేటట్లు చేస్తూ దానిని ఒక సంయుక్తమైన రక్షణనొసగే వ్యవస్ధగా రూపొందించే ఉద్దేశంతోను, అలాగే తమపై దండయాత్రలకు సిధ్దమౌతూవుండే మంగోలులను చైనా నుండి దూరంగా, అదుపులో ఉంచడానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చైనా గోడను నిర్మించడం జరిగింది. ఆకాశాన్నుండి ఒకే అద్భుతమైన మానవనిర్మితమైన కట్టడంగా కనిపిస్తూవుంటుందన్న వాదన వివాదాస్పదంగా మారినప్పటికి కూడా, కొన్ని వేలమంది, బ్రహ్మాండమైన ఈ గోడను నిర్మించడంలో తమ జీవితాలను ధారపోసి ఉండవచ్చు.

మచ్చు, పిచ్చు (1460-1470), పెరు

15వ శతాబ్దంలో ఇన్ కాన్ చక్రవర్తి పచ్చాక్యూటీ, మచ్చు, పిచ్చు(‘పాత పర్వతం’) అని పిలువబడే పర్వత శ్రేణులలో ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది. అసాధారణమైన ఈ జనావాసం దట్టమైన అమెజాన్ అడవిలో యాండిస్ ప్లేటు కు మధ్యలో ఎత్తుగా నిర్మితమై ఉండి, ఉరుబుంబా అనే నదికి పైనే వుంటుంది. కాలక్రమేణా, మశూచి వ్యాధి ప్రబలడంతో బహుశా ఇది ఇన్ కాసేలచే వదిలివేయబడి ఉండవచ్చు. ఆతరువాత స్పానిష్ వారు ఇన్ కాన్ సామ్రాజ్యాన్ని ఓడించడంతో, ఈ నగరం మూడు శతాబ్దాల పాటు ‘కనిపించకుండా’ పోయింది. తిరిగి ఇది 1911 లో హీరమ్ భింగమ్ చే తిరిగి కనుగొనబడింది.

పెట్రా (క్రీ.పూ 9 – క్రీ.శ..40) జోర్డాన్

అరేబియన్ ఎడారి అంచున, రాజు ఎరిటాస్ – IV (క్రీ.పూ 9 – 40 క్రీ.శ.) నబతియన్ సామ్రాజ్యపు యొక్క ఒక ప్రకాశవంతమైన రాజధాని నగరం పెట్రా. సముద్ర సంబంధిత సాంకేతిక రంగంలో ప్రవీణులైన నబతేయన్లు వారి నగరానికి ప్రసిధ్దిగాంచిన సొరంగ మార్గాలను మరియు నీటి కందకాల వంటి గదులను నిర్మించడం జరిగింది. గ్రీకు-రోమన్ల సంస్కృతిని పోలివుండి, 4000 మంది ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా వుండే ఒక రంగస్ధలం కూడా నిర్మించబడింది. ఈ నాడు పెట్రా యొక్క భవనాల వంటి సమాధులు, 42 మీటర్ల ఎత్తులో ఎల్-డీయర్ మోనాస్టరీ (ఒక మఠం వంటి ప్రాంగణం) వద్ద హెలెనిస్టిక్ దేవాలయానికి అభిముఖంగా ఉంటూ, మధ్య తూర్పు దేశాల సంస్కృతికి మరింత ఆకర్షణీయమైన తార్కాణాలుగా నిలుస్తూ ఉన్నాయి.
Similar questions