81. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి?
Answers
Explanation:
హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానం (ఆంగ్లం: High Court) అనగా భారతదేశంలోని రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతీ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ఒక్కో హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆరవ భాగం, ఐదవ అధ్యాయం, 214 వ నిబంధనను అనుసరించి ఏర్పాటయ్యాయి.
తెలంగాణ హైకోర్టు
మొత్తం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టులో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ల సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసులపై అయినా న్యాయ విచారణ కోసం హైకోర్ట్‌ను సంప్రదించవచ్చు. కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు న్యూఢిల్లీకు మాత్రమే ఉంది.
హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:
భారత దేశ పౌరుడై ఉండాలి.
కనీసం 10 సంవత్సరాలు పాటు దిగువ కోర్టులో న్యాయమూర్తిగా కానీ, హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగానో, న్యాయ శాస్త్రవేత్తగానో కానీ పనిచేసి ఉండాలి.