8th class telugu 6 th lesson answers
Answers
Explanation:
1ans:-పై పంక్తులు దేశభక్తి గేయంలోవి. ఆ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాసారు.
2ans:-స్వంత లాభం కొంచెం వదులుకొని, తోటివాడికి సాయం చేయాలి.దేశమంటే మట్టికాదు మనుషులు.దేశంలో పాడి పంటలు అభివృద్ధి అయ్యేటట్లు శ్రమించాలి.కండ బలం ఉన్నవాడే మనిషి.దేశ ప్రజలు కలసిమెలసి జీవించాలి.జాతిమత భేదాలు విడచి, ప్రజలు సోదరులవలె మెలగాలి.
3ans:-పరోపకారం, దేశభక్తి, ఐకమత్యం అనేవి అందరూ కలిగి ఉండాలనేదే ఈ గేయ సందేశం.
4ans:-దేశభక్తిని గురించిన గేయాలను, కవితలను, పద్యాలను కవులు ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి రాస్తారు.
I. వినడం – మాట్లాడడం
1ans:-ఈ పాఠంలోని పద్యాల్లో మన భారతదేశం తపోభూమి అని, బంగారు పంటలకు నిలయమని, శాంతి వెన్నెలలో,
కురిపించిన దేశమని, గంగ, గోదావరి వంటి పవిత్ర నదులు ప్రవహించిన దేశమని చదివినప్పుడు, నేను ఇటువంటి గొప్ప దేశంలో పుట్టాను కదా ! అని గర్వంగా తల ఎత్తుకొని తిరగాలనిపించింది. జన్మభూమి స్వర్గం కంటే గొప్పది కదా.
మరింతగా మన దేశ సౌభాగ్యం వర్ధిల్లేలా పాటుపడాలని అనిపించింది. మన దేశంలో అన్యాయాలు, దౌర్జన్యాలు, కుల మత హింసలు లేకుండా చూడాలని అనిపించింది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలు, పేదరికం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ప్రపంచ దేశాల్లో నేను జన్మించిన నా భారతమాత చాలా గొప్పది అనిపించింది.
2ans:-మనం చట్టసభలకు ఎన్నుకొనేవారే ప్రజా ప్రతినిధులు. అనగా ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు మొదలైనవాళ్ళు ప్రజల కష్టాల్ని చట్టసభల్లో ప్రతిధ్వనింపచేసేవారు కావాలి. ప్రజల సమస్యల్ని, కష్టాల్ని ప్రభుత్వానికి తెలిపి, వాటిని పరిష్కరించేవారు. కావాలి. అవినీతి, లంచగొండితనం, దుర్మార్గం అన్న వాటికి వారు దూరంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవాలి. వాటికి త్వరగా పరిష్కార మార్గాల్ని చూపించగలగాలి. ప్రతినిధుల ఎప్పుడూ ప్రజల పక్షంలోనే నిలబడాలి. అన్యాయానికీ, అధికారానికి బానిసలు కారాదు. సచ్ఛీలత కలిగి, సత్కార్యాలు: చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆదర్శప్రాయ జీవనం సాగించాలి.
3ans:-స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడవ, నాలుగవ సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులలో అవినీతి బాగా ఎక్కువైంది. రాజకీయ నాయకులలో, మంత్రులలో అవినీతి ఎక్కువైనపుడు అధికారులకి అది అనుకూలంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలలో గల సిబ్బంది ప్రతి చిన్నపనికీ లంచం తీసుకొంటున్నారు. ప్రతిపనికీ “ఒక రేటు” ఉంటోంది. చివరికి జీతాలు ఇవ్వడానికీ, పింఛను చెల్లించడానికి మాత్రమే కాదు – మరణించిన వాళ్ళకి “సర్టిఫికేట్” ఇవ్వడంలోనూ లంచం తప్పని పరిస్థితులున్నాయంటే అవినీతి ఎంతగా విలయతాండవం చేస్తోందో గ్రహించవచ్చు.
ఈ రోజు మన దేశంలో లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ లంచగొండితనం చిన్న ఉద్యోగుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రుల నుండి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ల దాకా ఈ లంచగొండితనం విస్తరించింది.
లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలో ఏ పనీ కావట్లేదు. ప్రపంచంలో లంచగొండితనం ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యమంత్రులూ, వారి పుత్రులూ, అల్లుళ్ళూ వేల కోట్ల రూపాయలు లంచాలుగా మేసేస్తున్నారు.
ఇందువల్ల మన దేశంలో అభివృద్ధి జరుగడం లేదు. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే పది పైసల పని కూడా కావట్లేదు. ఏ పనీ సక్రమంగా సాగటంలేదు. కట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, పరిశ్రమలు కొద్ది రోజుల్లోనే పాడయిపోతున్నాయి. దేశాన్ని రక్షింపవలసిన మిలటరీ, పోలీసు వ్యవస్థలు సైతం లంచగొండితనాన్ని మరిగి బాధితులకు అన్యాయం చేస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు లంచగొండితనానికి అలవాటుపడి జైళ్ళలో మగ్గుతున్నారు.అవినీతి, లంచగొండితనంల కారణంగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోంది. కనుక ప్రజలు యువత అవినీతి నిర్మూలనకు నడుంకట్టి ఈ దుష్ట జాడ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టాలి.