India Languages, asked by mekalasrilakshmi27, 8 months ago

కవి ఉద్దేశంలో నిజమైన సుఖం అంటే ఏమిటి?


8th class textbook 5th chapter ​

Answers

Answered by devaralakoteswararao
4

Answer:

ప్రపంచంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఎవరూ కష్టాలు కావాలని కోరుకోరు. చాలామంది తాము అనుభవిస్తున్నది నిజమైన సుఖమని అదే జీవితపరమావధి అని అపోహలో పడి జీవిస్తున్నారు. నిజానికి, శాంతిలేనిదే సుఖం లభించదు. లేనిపోని అనవసరపు ఆలోచనలు, విషయ లంపటాలపై ఆసక్తి… ఇత్యాదులను త్యజిస్తే శాంతి లభిస్తుంది.దృశ్య పదార్థాలతో, విషయ భోగాలతో లభించే సుఖం నిజమైన సుఖం కానేరదని గీతాచార్యులు చెబుతున్నారు. అది ప్రతిబింబ సుఖం, క్షణిక సుఖం, దుఃఖమిశ్రిత సుఖం. ఇది కాదు మనిషికి కావలసింది. అవిచ్ఛిన్న, పరిపూర్ణ నిరతిశయ సుఖం. అది కావాలంటే చిత్తంలో శాంతి ఏర్పడాలి.నశ్యర, అంటే నాశనమయ్యే ప్రాపంచిక పదార్థాల గురించి చింతించినందువల్ల శాంతి లభించదు. శాశ్వతమైన ఆత్మ గురించి, దైవం గురించి చింతించడం వల్ల, ధ్యానించడం వల్ల చిత్తంలో శాంతి నెలకొంటుంది. మనోనైర్మల్య స్థితితోనే ఆత్మచింతన, వివేకం ఉదయిస్తాయి. చిత్తం విషయాలవైపు పరుగులు తీయక, దృశ్య వాసనలు లేనప్పుడే బుద్ధి నిర్మలంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉండి, మనస్సంయమనం కలిగితే బుద్ధి పరిశుద్ధమవుతుంది

Explanation:

If you like this please add me as brainliest

Similar questions