9) తన రచనలను వర్ణన ప్రధానంగా రచించిన కవి ఎఱ్ఱన గారి గురించి వ్రాయండి.
Answers
Answered by
3
ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.
ఎర్రాప్రగడ తైలవర్ణచిత్రం చిత్రకారుడు:పి.ఎస్.చంద్రశేఖర్
సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎర్రయ్యను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
Similar questions